Sunday Mistakes : ఆదివారం నాడు ఎట్టిపరిస్థితుల్లో.. ఈ తప్పులని చేయకండి..!

September 4, 2023 12:46 PM

Sunday Mistakes : హిందూ మతంలో పలు నియమాలు ఉంటాయి. వాటిని మనం పాటిస్తూ ఉంటాము. పూర్వీకులు పాటించడం, ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టే మనం కూడా చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే, ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఆదివారం కొన్ని పనులను అస్సలు చేయకూడదు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆదివారంనాడు ఈ పనులని అసలు చేయకూడదు.

చాలా మంది ఆదివారం ఖాళీగా ఉంటామని, సెలవు అని ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ, వీటిని మాత్రం అసలు చేయకూడదు. ఆదివారం పూట జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం మంచిది కాదు. ఆదివారం రోజు ఆవాల నూనె తో జుట్టుకి మసాజ్ చేయడం కూడా పెద్ద తప్పు. ఈ తప్పును కూడా చేయకూడదు. ఆదివారం నాడు నీలం, నలుపు, బూడిద రంగు బట్టలు వేసుకోకూడదు. ఆదివారం నాడు ఈ బట్టలు వేసుకోవడం వలన మీకు చెడు జరుగుతుంది.

Sunday Mistakes do not do them or else bad luck
Sunday Mistakes

ఆదివారం సూర్యభగవానుడి రోజు. ఈరోజు బంగారం, నారింజ, గులాబీ, ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే, మంచి జరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి లభిస్తుంది. అలానే, ఆదివారం పూట రాగి మాత్రం వాడకండి. రాగితో తయారు చేసిన వస్తువులను ఆదివారం పూట కొనకూడదు. అదే విధంగా, ఆదివారం నాడు మాంసం, చేపలు, మద్యం వంటివి తీసుకోకూడదు.

ఆదివారం సూర్యుని అనుగ్రహం ఉండాలంటే, బచ్చలి కూర, వెల్లుల్లి, ఉల్లిపాయకి దూరంగా ఉండాలి. చాలా మంది సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటూ వుంటారు. సూర్యుడి అనుగ్రహం ఉండాలంటే, ఇంట్లో గులాబీ మొక్కలని పెంచాలి. ఆదివారాల్లో కోతులకు నీరు ఇవ్వాలి. గోధుమలను నీళ్ళల్లో కలిపి ఆవులకి పెట్టడం మంచిది. ఇలా చేయడం వలన, సూర్యుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. అలానే, తండ్రి ని ఆదివారం పూట జాగ్రత్తగా చూసుకోవాలి. అంధులకు ఆదివారం సహాయం చేస్తే మంచిది. ఇలా ఈ పనులు చేయడం వలన సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. సూర్యుడి అనుగ్రహం కలిగి, సమస్యలు అన్నింటికీ కూడా దూరంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment