Spoiled Coconut In Pooja : సాధారణంగా భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎక్కువగా దైవభక్తిని నమ్ముతారు. దైవానికి ఇచ్చినంత వ్యాల్యూ మరొకదానికి ఇవ్వరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు ముఖ్యంగా తీసుకెళ్ళేది కొబ్బరికాయ. సాధారణంగా కొబ్బరికాయలు మనం ఎప్పుడైనా కొట్టినప్పుడు కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి. ఇలా జరగడం కొంతమంది అరిష్టంగా భావిస్తూ ఉంటారు. ఇలా కొట్టినప్పుడు అందులో నీళ్లు లేకపోవడం పూర్తిగా కుళ్లిపోవడం చూసి చాలా మంది ఏదో జరిగిపోతుందని కంగారు పడుతూ ఉంటారు.
దైవం కోసం చేసిన పూజలో ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ ఉంటారు. ఇలా జరగడం అశుభంగా భావిస్తారు. సాధారణంగా కొబ్బరికాయ కుళ్ళిపోవడం సహజమే. దాన్ని అశుభ సూచకంగా భావించవలసి అవసరం ఏమీ లేదు. దేవాలయాల్లో కానీ ఇతర ఏదైనా శుభ కార్యాల్లో కానీ కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే కాయ కుళ్ళి పోలేదని మనపై ఉన్న కుళ్ళు, దిష్టి పోయాయని అర్థం చేసుకోవాలి. అంటే మనకు జరగబోయే కీడు తొలగిపోతుందని అర్థం. మనకు కీడు జరగకుండా ఉండేందుకు ఆ కీడు అనేది కుళ్లిన కాయ రూపంలోనే వెళ్లిపోయిందని చెబుతారు.
కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు జరుగుతుంది అనుకోవడం ఒక మానసిక బలహీనతగా భావించాలి తప్ప మరో విధంగా అర్థం చేసుకోకూడదని అంటారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు అని శాస్త్రాల్లో పురాణాల్లో దీనికి ఆధారాలు లేవు. మనం చేసే పూజలో నిష్ట ఉంటే ఇలాంటి సందేహాలు ఉత్పన్నం కావని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొట్టిన కొబ్బరికాయ కుళ్ళి పోయినా నీళ్లు లేక పోయినా ఎలాంటి కీడు జరగదని వారంటున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…