food

Egg 65 : కోడిగుడ్ల‌తో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ 65.. త‌యారీ ఇలా..!

Egg 65 : కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65, ఫిష్ 65, మ‌ట‌న్ 65.. ఇలా అనేక ర‌కాల వాటిని త‌యారు చేసిన‌ట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ 65 ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

ఎగ్ 65 త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 6, అల్లం – 2 ముక్క‌లు, వెల్లుల్లి – 6 నుంచి 10 రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి – 6, కొత్తిమీర – ఒక క‌ప్పు, క‌రివేపాకు – ఒక క‌ప్పు, గ‌రం మ‌సాలా – 4 టీస్పూన్లు, కారం – త‌గినంత, క‌శ్మీరీ కారం పొడి (రంగు కోసం) – 2 టీ స్పూన్లు, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – 2 క‌ప్పులు, చిల్లీ సాస్ – కొద్దిగా, జీల‌క‌ర్ర పొడి – 2 లేదా 3 టీస్పూన్లు, చ‌క్కెర – 2 టీస్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 1 లేదా 2 క‌ప్పులు.

Egg 65

ఎగ్ 65 త‌యారు చేసే విధానం..

కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి వాటిల్లో ఉండే ప‌చ్చసొన తీసేసి తెల్ల సొన మాత్ర‌మే తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్క‌ల‌కు స‌న్న‌గా త‌రిగిన అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, కొద్దిగా కారం, గ‌రం మ‌సాలా, బ్రెడ్ ప్రౌడ‌ర్‌, కార్న్ ఫ్లోర్ వేసి క‌లిపి పెట్టుకోవాలి. రెండు కోడిగుడ్లను ప‌గ‌ల‌గొట్టి వాటిల్లో నుంచి తెల్లసొన తీసి ఆ మిశ్ర‌మంలో బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లుపుతూ చిన్న చిన్న ఉండ‌లుగా చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆ ఉండ‌ల‌ను వేస్తూ వాటిని బంగారు రంగు వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి.

మ‌రో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి కాగానే అందులో స‌న్న‌గా తరిగిన అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర‌ప కాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి బాగా వేయించాలి. అనంతరం అందులో పెరుగు వేసి కొద్దిగా ఉడ‌క‌గానే కశ్మీరీ కారం పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, చిల్లీ సాస్ వేయాలి. చ‌క్కెర వేస్తే రుచి బాగుంటుంది. త‌రువాత కొత్తిమీర వేయాలి. అనంత‌రం ముందుగా వేయించి పెట్టుకున్న ఉండ‌ల‌ను వేయాలి. మంట కాస్త‌ పెంచి ముక్క‌ల‌కు గ్రేవీ బాగా ప‌ట్టేవ‌ర‌కు ప్యాన్‌ను అటు ఇటు తిప్పాలి. బాగా ఉడికింది అనుకుంటే.. వెంట‌నే దించేయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ 65 త‌యార‌వుతుంది. దీన్ని ఉల్లిపాయ ముక్క‌లు, నిమ్మ‌ర‌సంతో క‌లిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM