Shiva Darshan : సాధారణంగా హిందువులు ఎవరైనా సరే ఏ దేవున్ని లేదా దేవతను అయినా సరే.. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివార్ల విగ్రహాలను చూస్తూ దర్శనం చేసుకుంటారు. కానీ ఒక్క శివాలయంలో మాత్రం దైవ దర్శనం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ దర్శనం చేసుకుంటారు. ఆ తరువాతే ఆలయంలోకి వెళ్లి లింగ దర్శనం చేసుకుంటారు. అయితే అసలు ఇలా శివాలయాల్లో ముందుగా నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు చూడాలి ? నేరుగా వెళ్లి శివున్ని దర్శించుకుంటే ఏమవుతుంది ? అలా ఎందుకు చేయరాదు ? అంటే..
శివుడు త్రిమూర్తులలో ఒకడు. కేవలం ఆయనకు మాత్రమే విగ్రహ రూపం ఉండదు. ఆయన్ను లింగ రూపంలో దర్శించుకోవాలి. శివుడు లయ కారకుడు. ఆయనకున్న మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. సకలం భస్మం అయిపోతుంది. అంతటి శక్తి ఆయన మూడో కన్నుకు ఉంటుంది. కనుక అలాంటి శక్తివంతున్ని నేరుగా దర్శించుకోరాదు. ముందుగా నంది కొమ్ముల నుంచి చూసి లింగ దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపలికి వెళ్లి లింగాన్ని చూడాలి. అంతే కానీ నేరుగా శివాలయం గర్భగుడిలోకి వెళ్లరాదు. వెళితే అరిష్టం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నంది వీపుపై నిమురుతూ మన కుడి చేతితో నంది చెవి మూయాలి. అనంతరం మన మనస్సులో ఉన్న కోరికతోపాటు మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం చెప్పాలి. అలా చెబుతూ శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవెరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తులకు కైలాస ప్రాప్తి కలుగుతుందట. మరుసటి జన్మ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…