సంధ్యా సమయంలో దీపం పెట్టి ఓం నమశ్శివాయ పంచాక్షరీ మంత్రం జపిస్తే..!

February 27, 2022 8:52 AM

త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా  పరమేశ్వరుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పరమేశ్వరుడి గురించి మనకు శివపురాణంలో ప్రతి విషయం చెప్పబడింది. శివ పురాణం ప్రకారం పూర్వజన్మలో కుబేరుడు ఒక దొంగగా ఉండేవాడు. పూర్వజన్మలో దొంగ అయిన కుబేరుడు తరువాత జన్మలో అధిక ధనికుడుగా మారాడు.

పూర్వజన్మలో అతని పేరు గొన్నిధి. ఒకానొక దశలో తినడానికి తిండి కూడా లేకపోవడంతో దొంగగా మారాడు. ఈ క్రమంలోనే ఒక శివాలయంలో అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు కనిపించడంతో వాటిని దొంగతనం చేయాలని గొన్నిది భావిస్తాడు. ఆ సమయంలోనే ఆలయంలోకి ప్రవేశించగానే పెద్ద ఎత్తున గాలులు వీచడంతో ఆలయంలో ఉన్న దీపం ఆరిపోతుంది.

ఆలయంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించడం కోసం గొన్నిధి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే ఎంత వెలిగించినా దీపం వెలుగదు. అలా ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో విసుగు చెందిన అతను తన చొక్కాతీసి మంటపెట్టి దాంతో దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యి గణాల్లో ఒక అధిపతిని చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మలో కుబేరుడిగా పుట్టి సంపదకు రక్షకుడిగా ఉంటాడు. ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు సంధ్యాసమయంలో శివుడి ముందు దీపం వెలిగించి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని.. శివపురాణం తెలియజేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now