ఆధ్యాత్మికం

Shirdi Sai Baba : షిరిడీకి ర‌మ్మ‌ని బాబా పంపించే గుర్తులు.. ఇవి క‌నిపిస్తే త‌ప్ప‌కుండా షిరిడీకి వెళ్లండి..

Shirdi Sai Baba : బాబా భ‌క్తులు ప్ర‌తి ఒక్క‌రు జీవితంలో ఒక్క‌సారైనా షిరిడీకి వెళ్లి బాబాను ద‌ర్శించుకోవాల‌ని కోరుకుంటారు. షిరిడీకి వెళ్లి బాబాకు పూజ‌లు చేయాల‌ని, బాబా స‌మాధిని తాకాల‌ని, బాబాగా గారి వ‌స్త్రాల‌ను తెచ్చుకోవాల‌ని, బాబా గారు న‌డిచిన‌టువంటి షిరిడీని చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అయితే కొంద‌రు అనుకోకుండానే షిరిడీని వెళ్తూ ఉంటారు. కొంద‌రు ఎంత ప్రయ‌త్నించినా కూడా షిరిడీని వెళ్ల‌లేరు. షిరిడీకి వెళ్లాలంటే మ‌న‌కు బాబా గారి అనుగ్ర‌హం త‌ప్ప‌కుండా ఉండాలి. బాబా గారి అనుగ్ర‌హం లేనిదే మ‌నం షిరిడీకి వెళ్ల‌లేము. బాబా గారి ద‌ర్శ‌నం చేసుకోలేము.

షిరిడీకి వెళ్లి బాబా గారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని మ‌నం బాబాను క‌నుక పూజిస్తే బాబా మ‌న‌ల్ని త‌ప్ప‌కుండా అనుగ్ర‌హిస్తారు. అయితే షిరిడీకి ర‌మ్మ‌ని త‌న ద‌ర్శనం చేసుకోమ‌ని బాబా గారు మ‌న‌కు సంకేతాల‌ను పంపుతార‌ని పండితులు చెబుతున్నారు. ప‌ని ఒత్తిడిలో ప‌డి, బాధ‌లు, క‌ష్టాల కార‌ణంగా కొన్ని సార్లు మ‌నం ఈ సంకేతాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తాము. ఆ సంకేతాలు ఒక్కొసారి మ‌న‌కు అర్థం కావు. షిరిడీకి వెళ్ల‌డానికి బాబా గారు మ‌న‌కు పంపించే సంకేతాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న బందువులు కానీ , స్నేహితులు కానీ మేము బాబా గారి ద‌ర్శ‌నానికి షిరిడీ వెళ్తున్నాము మీరు కూడా వ‌స్తారా అని మ‌న‌కు ప్ర‌త్యేకంగా ఫోన్ చేసిమ‌రీ అడుగుతారు. ఇదే బాబా గారు త‌న దర్శ‌నార్థం మ‌న‌కు పంపించే మొద‌టి సంకేతం.

Shirdi Sai Baba

అలాగే బాబా గారి షిరిడీ హార‌తి మ‌న‌కు అప్ర‌య‌త్నంగానే వినిపిస్తూ ఉంటుంది. ఈ హార‌తి ఎక్క‌డ నుండి వినిపిస్తుందో కూడా తెలియ‌దు. ఇలా క‌నుక మ‌న‌ర‌కు హార‌తి వినిపిస్తే బాబా గారు మ‌న‌ల్ని షిరిడీకి ర‌మ్మ‌నార‌ని గుర్తించాలి. అలాగే బాబా గారి విభూది కానీ, ప్ర‌సాదం కానీ, ఫోటో కానీ, విగ్ర‌హం కానీ గురువారం నాడు మ‌న ఇంటికి చేరిందంటే అది బాబా గారు త‌న‌ని ద‌ర్శించుకోమ‌ని పంపే సంకేతంగా భావించాలి. మ‌నం సంతోషంగా ఉన్న‌ప్పుడు మ‌నంత‌ట మ‌న‌మే షిరిడీ ద‌ర్శ‌నానికి వెళ్తాము.కానీ క‌ష్టాల్లో,బాధ‌ల్లో ఉన్న‌ప్పుడు బాబా గారు ఈ సంకేతాల‌ను మ‌న‌కు పంపుతారు. బాబా గారి ద‌ర్శ‌నం చేసుకుంటే క‌ష్టాలు, బాధ‌లు తొల‌గిపోతాయ‌ని దీని అర్థం. అలాగే బాబా గారు మ‌నకు క‌ల‌లో ద‌ర్శ‌న‌మిస్తారు.

మ‌న చెయ్యి ప‌ట్టుకుని బాబా గారు మ‌న‌ల్ని షిరిడీ తీసుకెళ్తున్న‌ట్టుగా, అలాగే ఏదోఒక రూపంలో బాబా గారి ద‌ర్శ‌నం మ‌న‌కు క‌లుగుతుంది. ఇలా బాబా గారు మ‌న‌కు క‌ల‌లో క‌నిపిస్తే క‌నుక మ‌న‌కు షిరిడీకి బాబాగారు మ‌న‌కు పంపించే సంకేతంగా భావించాలి. ఈ సంకేతాలు క‌నిపించిన వెంట‌నే మ‌నం షిరిడీ వెళ్లి బాబా గారి ద‌ర్శ‌నం చేసుకోవాలి. అయితే అప్పు చేసి మాత్రం అస్స‌లు షిరిడీ వెళ్ల‌కూడ‌ద‌ని డ‌బ్బుల‌తో ఇబ్బంది ప‌డే వారికి డ‌బ్బులు ఎలా స‌మ‌కూర్చాలో బాబాకు తెలుస‌నని అంతేకానీ అప్పు చేసి షిరిడీకి వెళ్లాల‌నే నిర్ణ‌యం స‌రైన‌ది కాద‌ని బాబా గారు స‌చ‌రిత్ర‌లో తెలిపార‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM