స్త్రీలు మట్టి గాజులను ధరించడం వెనుక ఉన్న కారణం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

June 18, 2021 8:16 PM

సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ఎన్నో కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే పెళ్లైన మహిళలు నిత్యం సుమంగళిగా ఉండాలని నుదుటిన తిలకం, మెడలో మంగళ సూత్రం, కాలికి మెట్టెలు, చేతులకు గాజులు ధరించి ఉంటారు. ఈ విధంగా ధరించడం వల్ల తను దీర్ఘసుమంగళీగా ఉంటుందని భావిస్తారు.

reason behind women wear clay bangles

మన సంప్రదాయాల ప్రకారం గాజులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏదైనా శుభకార్యం జరిగినా మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చిన వారికి పసుపు, కుంకుమతో పాటు గాజులను ఇవ్వడం ఆచారం. ఇలా మట్టి గాజులు ధరించడం వల్ల వారి భర్త ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. అందుకోసమే పెళ్లైన మహిళలు తప్పనిసరిగా గాజులను ధరించాలని పెద్ద వారు చెబుతుంటారు.

ఈ విధంగా గాజులను ధరించడం ఒక ఆచారం అయితే సైన్స్ పరంగా గాజులను ధరించడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేతికి గాజులు ధరించడం వల్ల మణికట్టు వద్ద రాపిడి జరిగి మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అదేవిధంగా మనకు శక్తిని కూడా పెంచుతుంది. మనకు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు లేకుండా ఉండటమేకాకుండా మన శరీరంలో ఉన్న వేడిని బయటకు తొలగిస్తుంది. అందుకోసమే కేవలం మట్టి గాజులను మాత్రమే ధరించాలని మన పెద్దవారు చెబుతుంటారు.ఈ విధంగా గాజులు ధరించడం ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now