Lord Shiva : శివుడికి ఇలా పూజ చేస్తే చాలు.. వెంట‌నే ఉద్యోగం వ‌స్తుంది.. ఆదాయం పెరుగుతుంది..!

July 28, 2023 12:51 PM

Lord Shiva : ఉద్యోగం లేకపోతే ఎంతో కష్టంగా ఉంటుంది. చాలా మంది ఉద్యోగం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఉద్యోగాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారా..? అయినా సరే కుదరడం లేదా..? అయితే ఇలా చేయండి. పరమేశ్వరుడి అనుగ్రహం కలిగితే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది. శివ కుటుంబం అంటే పార్వతీ, శివుడు, వినాయక, కుమారస్వామిలు. ఈ నలుగురు కుటుంబ సమేతంగా ఉన్న ఒక ఫోటోని పూజ గ‌దిలో పెట్టండి. మారేడు దళం తీసుకుని దాని మీద గంధం రాసి మీ యొక్క కోరికని చెప్పాలి.

పార్వతి దేవికి నాకు ఉద్యోగం కలగాలని మీరు చెప్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల‌ అనుగ్రహం కలిగితే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అమ్మ మనసు వెన్న. ఆమెకి కోరిక చెప్తే కచ్చితంగా అనుకున్నది నెరవేరుతుంది. పరమ శివుడికి మారేడు దళం అంటే ఎంతో ఇష్టం. శివుడికి మారేడు దళాన్ని సమర్పిస్తే జన్మాంతర పాపాలని పోగొట్టుకోవచ్చు.

pray to lord shiva like this for job
Lord Shiva

మారేడు దళం మీద ఉన్న గంధం అమ్మవారికి ఎంతో ఇష్టం. అమ్మవారిని సంతోష పెడుతుంది. శాంతిని కలిగిస్తుంది. అయితే వీటిని మీరు సమర్పించే ముందు.. యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణా సంస్థితా.. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.. అని ఈ విధంగా 108 సార్లు జపించి ఆ తర్వాత పెట్టండి. ఇలా చేయడం వలన పాపాలు పోతాయి. ఉద్యోగం కలుగుతుంది.

అనుకున్న ఉద్యోగం వచ్చి సంతోషంగా జీవించడానికి అవుతుంది. కాబట్టి ఉద్యోగాన్ని పొందాలనుకునే వాళ్ళు ఉద్యోగం రాక ఎన్నో ఇబ్బందులు పడేవారు ఈ విధంగా చేస్తే మంచిది. ఇలా చేయడం వలన త్వరగా ఉద్యోగం వస్తుంది. ఇలా చేయడం వలన ఉద్యోగం ఉన్న వాళ్ళకి సంపాదన కూడా పెరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now