Pooja Room : ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా దేవుడి చిత్రపటాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ గది ఉంటుంది. అయితే పూజగదిని, దేవుడి ప్రతిమలను ఆర్థిక స్థోమతని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే చోటుని బట్టి కూడా పెట్టుకుంటూ ఉంటారు. దేవుడికి ప్రత్యేకించి కొందరు ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవడం మంచిది.
ఈశాన్యం వైపు ఆ గదిలో ఎత్తుగా అరుగు కానీ మందిరంలాగా కానీ కట్టుకుని నిర్మించకూడదు. దేవుడి పటాలని ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ, నైరుతి దిక్కులలో పీట వేసి కానీ లేదంటే వస్త్రంపై కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ దేవుడి చిత్ర పటాలని మీరు వేలాడ తీయాలి అనుకుంటే, ఈశాన్యం గదిలో దక్షిణం, పశ్చిమం వైపు పెట్టుకోవచ్చు. ఒకవేళ దేవుడి గదిని ఈశాన్యం వైపు మీరు పెట్టుకోలేకపోతే, తూర్పు వైపు పెట్టుకోవచ్చు లేదంటే ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయువ్యాలలో కూడా పెట్టుకోవచ్చు.
నైరుతి, ఆగ్నేయ గదుల్ని మాత్రం దేవుడి గదులుగా పెట్టుకోకండి. దేవుడి గదిని ఏర్పాటు చేసుకోలేకపోతే ఇక ఏ గదిలో అయినా సరే అల్మారాలో కానీ పీట మీద కానీ దేవుడి పటాలని, ప్రతిమలని పెట్టుకుని పూజించవచ్చు. దేవుళ్ళని పెట్టేటప్పుడు తూర్పు, ఉత్తరాలకి ఉండాలి. ధ్యానం చేసే వాళ్ళు, తూర్పు వైపు అభిముఖంగా ఉండి, ధ్యానం చేస్తే మంచిది.
పూజగదికి ఎటువైపు కూడా ఆనుకుని బాత్‌రూమ్ ఉండకూడదు. అలాగే పూజగది పైన కానీ కింద కానీ టాయిలెట్స్ కూడా ఉండకూడదు. అపార్ట్మెంట్లో ఉండే వాళ్లు కూడా కచ్చితంగా చూసుకోవడం మంచిది. అలాగే పూజ చేసేటప్పుడు వట్టి నేల మీద కూర్చుని పూజ చేయకూడదు. చాప కానీ ఏదైనా వస్త్రాన్ని కానీ వేసుకొని పూజ చేయాలి. ప్రతి ఒక్కరూ కచ్చితంగా వీటిని పాటించడం మంచిది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…