Money Tips : స్త్రీలు స్నానం చేయ‌కుండా ఈ పనులు చేస్తే.. ల‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

December 13, 2023 12:13 PM

Money Tips : ప్రతి ఒక్కరు కూడా, ఇంటికి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటుంటారు. ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా, అనేక ఇబ్బందులు వస్తాయి. మనం చేసే తప్పులు వలన, ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. ఈ తప్పులు తీసేస్తే, అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. పైగా, ఇంటికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. తెలిసి చేసిన తెలియక చేసిన, తప్పు తప్పు. కనుక ఎప్పుడూ కూడా తప్పుని తెలిసి కానీ తెలియక కానీ చేయకూడదు.

స్త్రీలు సంతోషంగా ఉంటే, లక్ష్మీదేవి కూడా ఆ ఇంట కొలువై ఉంటుందని శాస్త్రాలు చెప్పడం జరిగింది. పొరపాటున కూడా, ఇలాంటి తప్పులు స్త్రీలు అసలు చేయకూడదు. కొంతమంది స్త్రీలు ఉదయం పూట స్నానం చేయరు. మిగిలిన పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అయితే, కొన్ని రకాల పనులను స్నానం చేయక ముందు చేస్తే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. డబ్బుని, సంపదని లక్ష్మీదేవిగా భావిస్తారు.

Money Tips women do not do these things or else wealth will not come
Money Tips

శాస్త్రం ప్రకారం స్నానం చేయకుండా డబ్బులని ముట్టుకోకూడదు. అలా ముట్టుకోవడం వలన, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అదేవిధంగా, స్నానం చేయకుండా స్త్రీలు తులసి మొక్కని ముట్టుకోకూడదు. రోజూ ఉదయం పూట, చాలామంది స్నానం చేయకుండా, తులసి మొక్కను ముట్టుకుంటారు.

ఇలా చేయడం వలన, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట తులసి మొక్కకి నీళ్లు పోసేటప్పుడు కూడా, శుభ్రంగా కాళ్ళు, చేతులు కడుక్కుని ఆ తర్వాత మాత్రమే, తులసి మొక్కకి నీళ్లు పోయాలి. తలస్నానం చేసే ముందు, జుట్టు దువ్వుకోవడం కూడా మంచిది కాదని శాస్త్రం చెప్తోంది. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే జుట్టు దువ్వుకోవాలి. స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now