Lord Vishnu : పిల్లలు మాట వినకపోయినా, ఆర్థిక బాధలు ఉన్నా.. ఈ స్తోత్రాన్ని చదువుకోండి..!

August 27, 2023 9:47 AM

Lord Vishnu : చాలా మంది ప్రతిరోజూ విష్ణు సహస్రనామాలను చదువుతుంటారు. అయితే విష్ణు సహస్రనామాల గురించి కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. విష్ణు సహస్రనామం విశిష్టత ఏమిటో ఇక్కడ ఉంది. మరి ఇక ఇప్పుడే తెలుసుకోండి. ఎవరైనా సరే విష్ణు సహస్రనామాలను చదువుకోవచ్చు. ఎప్పుడైనా మంత్ర జపం చేసేటప్పుడు ఒక దగ్గర స్థిరంగా కూర్చుని మాత్రమే చేయాలి. కానీ నామాలని మాత్రం అటూ ఇటూ తిరుగుతూ కూడా చదువుకోవచ్చు.

జాగృతికి ఆది దేవుడు శ్రీమహావిష్ణువు. ఉదయం లేస్తూనే శ్రీహరి శ్రీహరి శ్రీహరి అంటూ నిద్రలేవడం మంచిది. అయితే శాస్త్రం ప్రకారం మంచం మీద పడుకుని దైవానికి సంబంధించి ఎలాంటి పనులు కూడా చేయకూడదు. కానీ విష్ణు సహస్రనామానికి అలాంటి నిబంధన ఏమీ లేదు. నిజానికి అనారోగ్యంతో బాధపడే ఏ వ్యక్తి కూడా మంచం మీద ఔషధాన్ని తీసుకోకూడదు. కానీ మంచం మీద నుండి లేస్తూ విష్ణు సహస్రనామం చదవాలని అనిపిస్తే చక్కగా చదువుకోవచ్చు.

Lord Vishnu mantram daily read for economical problems go away
Lord Vishnu

విష్ణు సహస్రనామాలను చదువుకోవడం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. పిల్లలు మీ మాట వినాలన్నా కూడా విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. విష్ణు సహస్రనామాన్ని చదవడం వలన ఇలా అనేక ప్రయోజనాలని పొందవచ్చు. విష్ణు సహస్రనామానికి ఎటువంటి నిబంధన లేదు. కాబట్టి చక్కగా ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకోవచ్చు. ఉదయం లేవగానే ఎవరు అయితే విష్ణు సహస్రనామాలను చదువుకుంటారో వాళ్ళకి చక్కటి ఫలితాలు కనబ‌డతాయి. బాధలన్నీ పోతాయి.

కలి ఉధృతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన స్తోత్రం ఇది. విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చు. చూశారు కదా.. విష్ణు శాస్త్ర నామాన్ని చదువుకోవడం వలన ఎలాంటి నష్టాలు లేకుండా ఉండొచ్చు అనేది. మరి ఇక ఈసారి వీలు కుదిరినప్పుడల్లా విష్ణు సహస్రనామాలను చదువుకోండి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now