మనిషి శరీరం గురించి.. శివుడు పార్వతితో చెప్పిన రహస్యాలు ఇవి..!

August 24, 2023 5:41 PM

చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడి గురించి చాలా విషయాలు మనకి తెలిసి ఉంటాయి. అయితే, పరమశివుడు ఒకరోజు పార్వతీ దేవికి మన శరీరం గురించి ఈ విధంగా చెప్పాడట. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. స్వరం ఒకటి. మూడు రూపాలుగాను, ఐదు రూపములు గాను అగును. ఈ ఐదు మళ్లీ ఒక్కో రూపముగా అవుతుంది. మళ్ళీ 5 చొప్పున, 25 విధములుగా అవుతుంది అని పరమశివుడు పార్వతితో చెప్పాడు.

అలాగే శరీరాన్ని పిండమని అంటారు. ఆ పిండం నందు శరీరం ఉంటుంది. ఐదు రోజులకి బుడగలాగా ఉంటుంది. 10 రోజులకి నెత్తురు కలుగుతుంది. 15 రోజులకి మాంసం ముద్ద అవుతుంది. 20 రోజులకి గట్టి మాంసం ముద్ద అవుతుంది. 25 రోజులకి సమాన రూపం వస్తుంది. మొదటి నెల పంచభూతములు కూడును. రెండవ నెల మేధస్సు కలుగుతుంది. మూడవ నెల ఎముకలు ఏర్పడతాయి. నాలుగవ నెల అయితే అవయవాములు వస్తాయి.

lord shiva told these secrets about humans to parvati

ఐదవ నెలలో రంధ్రములతో కూడిన చెవులు, ముక్కు, కళ్ళు, నోరు మొదలైనవి వస్తాయి. ఆరవ నెల కంఠ రంధ్రం ఏర్పడుతుంది. ఏడవ నెల పుట్టిన శిశువు బ్రతుకుతాడు. కానీ అల్పా ఆయువు, అల్ప బలము, క్షీణధాతువు వంటివి ఉంటాయి. ఎనిమిదవ నెల జన్మించిన ఏ శిశువు కూడా పుట్టదు. తల్లి దేహము శిశువు దేహమునందు ప్రాణము తిరుగుతూ ఉంటుంది.

9వ నెల గర్భమునకు జ్ఞానం వస్తుంది. 9వ నెల కానీ పదవ నెల కానీ ప్రాణములతో పుడతారు. స్త్రీ రేతస్సు అధికంగా ఉండి, పురుషుని వీర్యం తక్కువగా ఉంటే ఆడ సంతానం కలుగుతుంది. అదే పురుషుని వీర్యం ఎక్కువగా ఉండి, శ్రీ రేతస్సు తక్కువ ఉంటే మగ పిల్లవాడు పుట్టును. ఇలా ఈ విషయాలని శివుడు పార్వతితో చెప్పాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now