Lord Shiva : చాలామంది శివుడిని పూజిస్తూ ఉంటారు. శివుడిని పూజించేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఈ తప్పులను కనుక చేశారంటే, అనవసరంగా మీరే ఇబ్బందుల్లో పడతారు. శివుడిని పూజించేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. భక్తుల కోరికల్ని తేలికగా శివుడు నెరవేరుస్తాడు. భక్తులకి ఎలాంటి కష్టం వచ్చినా సరే, శివుడు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. సోమవారం నాడు శివుడిని ఆరాధించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 3 ఆకులతో కూడిన బిల్వపత్రాన్ని శివుడికి కచ్చితంగా సోమవారం నాడు సమర్పించాలి.
శివుడికి బిల్వపత్రం అంటే ఎంతో ప్రీతి. ఈ మూడు ఆకులు శివుడి మూడు కళ్ళకి చిహ్నం. అలానే త్రిశూలానికి కూడా సంకేతం. బిల్వపత్రాలతో శివుడిని కొలిస్తే గత మూడు జన్మల పాపాలని శివుడు తొలగిస్తాడని అంటారు. అయితే బిల్వపత్రాన్ని సోమవారం నాడు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి నాడు, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో కోయకూడదు. బిల్వపత్రాలని శివుడికి పెట్టినప్పుడు పాడైన లేదా మురిగిన ఆకుల్ని పెట్టకూడదు. బిల్వపత్రంతో శివుడిని పూజించేటప్పుడు ఒకసారి ఆకుల్ని కడిగి ఆ తర్వాత శివుడికి సమర్పించాలి.
కొబ్బరినీళ్ళని మాత్రం శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధాన్ని మాత్రమే పెట్టాలి. కుంకుమ సమర్పించడం వలన శివుడికి చల్లదనాన్ని ఇచ్చే బదులు వేడిని కలిగిస్తుంది. శివుడికి ఎటువంటి పండ్లని అయినా కూడా పెట్టొచ్చు. వెలగపండు మాత్రం శివుడికి ఎంతో ఇష్టం. శివుడికి పూలు పెట్టేటప్పుడు సంపంగి పూలని పెట్టకండి.
ఏ దేవుడినైనా పూజించే ముందు కచ్చితంగా వినాయకుడిని పూజించాలి. అలానే శివుడిని పూజించేటప్పుడు కూడా వినాయకుడిని ఆరాధించడం మర్చిపోకండి. శివపురాణం ప్రకారం తులసి ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు. శివుడిని పూజించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. శివుడిని పూజించేటప్పుడు కచ్చితంగా ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత మాత్రమే పూజ చేయాలి. చూశారు కదా ఎలా శివుడిని ఆరాదించాలో. మరి ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…