Lord Shiva : శివుడికి ఇష్ట‌మైన ప‌నులు ఇవే.. ఇలా చేస్తే శివానుగ్ర‌హం పొంద‌వ‌చ్చు..!

July 1, 2023 10:15 PM

Lord Shiva : చాలామంది శివుడు ని ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకించి సోమవారం నాడు, శివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. శివుడికి ఇష్టమైన ఈ పనులు కనుక చేశారంటే, శివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. శివుడి అనుగ్రహం కలిగి అనుకున్న పనులు పూర్తవుతాయి. సోమవారం నాడు తల స్నానం చేసి, నుదుట విభూది పెట్టుకోవాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు కట్టుకుని పూజ చేసుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు ”ఓం నమశ్శివాయ” అని 108 సార్లు జపించాలి. కానీ ఒకటి మర్చిపోకండి. శివుడిని పూజించడానికి మొదట వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత శివుడుని పూజించాలి.

సోమవారం నాడు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయిస్తే, కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం. కాబట్టి వీలైతే ఈ పని కూడా చేయండి. శివుడికి తులసి ఆకులతో పూజ చేయొద్దు. సోమవారం శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యం మీకు కలుగుతుంది, అంతే కాదు బిల్వపత్రాలతో పూజ చేస్తే, జన్మజన్మల పాపం పోతుంది.

Lord Shiva likes these do this pooja on monday
Lord Shiva

శివలింగం కనుక మీ ఇంట్లో ఉంటే, కచ్చితంగా పైనుండి జలధార ఉండాలి. కుంకుమ అస్సలు శివలింగానికి పెట్టకూడదు. విభూతి, గంధం మాత్రమే శివుడికి పెట్టాలి. ఎందుకంటే కుంకుమ సమర్పించడం వలన శరీరంలో వేడి పుట్టిస్తుంది. అందుకే శివుడికి కుంకుమ పెట్టకూడదంటారు. శంకు పుష్పాలు, తామర పువ్వులతో శివుడికి పూజ చేస్తే పాపాలన్నీ కూడా పోతాయి. శివుడికి పారిజాత పుష్పాలతో పూజ చేస్తే సంపద పెరుగుతుంది.

జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తే ఆరోగ్యం ఉంటుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజించద్దు. సోమవారం శివుడితో పాటు అమ్మవారిని కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. సోమవారం నాడు శివుడికి పూజ చేసే వాళ్ళు మాంసాహారాన్ని తీసుకోకూడదు. మద్యం కూడా తీసుకోకూడదు. ఉల్లిపాయలను కూడా తీసుకోకూడదు. సోమవారం నిత్యం శివనామ స్మరణతో గడిపితే గ్రహదోషాలు కూడా పోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now