ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడికి ఇష్ట‌మైన ప‌నులు ఇవే.. ఇలా చేశారంటే.. బోలెడంత ఫ‌లితం..!

Lord Shiva : శివుని ఆజ్ఞ లేనిదు చీమైనా కుట్ట‌దు అని మ‌న పెద్ద‌లు చెబుతూ ఉంటారు. అటువంటి మహా శివుని అనుగ్ర‌హం మ‌న‌పై ఉండాల‌ని అనేక ర‌కాల పూజ‌లు, ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. జీవితంలో ఎదగాల‌ని మ‌నం ఎంత ప్ర‌య‌త్నించినా ఆ శివుని ఆజ్ఞ లేనిదే మనం ఏది సాధించ‌లేము. ఆ శివుని మెప్పు పొంది శివానుగ్ర‌హం మ‌న‌పై ఉండాలంటే శివున్ని కొన్ని ప్ర‌త్యేక‌మైన వ‌స్తువులు, పూలతో పూజించాల‌ని పండితులు చెబుతున్నారు. కష్టాలు, బాధ‌లు, స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు శివునికి ఇష్ట‌మైన ప‌నులు చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా శివుని అనుగ్ర‌హాన్ని పొంద‌వ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు. శివుని అనుగ్ర‌హాన్ని పొంద‌డానికి మ‌నం చేయాల్సిన ప‌నులు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మొద‌ట‌గా శివున్ని సోమ‌వారం నాడు పూజించాలి. శివున్ని పూజించే ముందు శుభ్రంగా త‌ల‌స్నానం చేసి శుభ్ర‌మైన వ‌స్త్రాల‌ను ధ‌రించి నుదుటున విభూతి ధార‌ణ చేయాలి. శివున్ని స‌మ‌యంలో 108 సార్లు ఓం న‌మఃశివాయ అనే మంత్రాన్ని జ‌పించాలి. అలాగే శివుని పూజించ‌డానికిముందుగా వినాయ‌కుడిని పూజించాలి. శివుడికి కుంకుమ పెట్ట‌కూడదు. విభూతి, గంధం మాత్ర‌మే పెట్టాలి. శివుడు ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా సోమ‌వారం నాడు శివాల‌యానికి వెళ్లి శివ‌లింగానికి అభిషేకాన్ని చేయించాలి. శివునికి మాత్రం తుల‌సి ఆకుల‌ను అస్స‌లు స‌మ‌ర్పించ‌కూడ‌దు. అదే విధంగా సోమ‌వారం రోజున శివుడికి బిల్వ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల జ‌న్మ జ‌న్మ‌ల పాపాలు తొల‌గిపోతాయి. కోటి జ‌న్మ‌ల పుణ్యం ల‌భిస్తుంది. శివున్ని శంకు పుష్పాలు, తామ‌ర పువ్వుల‌తో పూజించ‌డం వ‌ల్ల పాపాలు తొల‌గిపోతాయి.

Lord Shiva

పారిజాత పుష్పాల‌తో పూజించ‌డం వ‌ల్ల స‌క‌ల సంప‌ద‌లు క‌లుగుతాయి. జిల్లేడు పువ్వుల‌తో పూజించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. అదే విధంగా శివున్ని మ‌ల్లెపువ్వుల‌తో పూజించ‌డం వ‌ల్ల వివాహం జ‌రుగుతుంది. అదే విధంగా శివుడు సంప‌గి పూల‌కు శాపం విధించ‌నట్టుగా పురాణాలు చెబుతున్నాయి. క‌నుక సంప‌గి పూల‌తో శివున్ని పూజించ‌కూడ‌దు. అలాగే స‌క‌ల శుభాలు క‌ల‌గాంటే సోమ‌వారం నాడు శివుడితో పాటు అమ్మ‌వారికి కూడా పూజ‌లు చేయాలి. అలాగే సోమవారం నాడు శివున్ని పూజించే వారు ధూమ‌పానం, మ‌ద్య‌పానం చేయ‌కూడ‌దు. మాంసాహారాన్ని, ఉల్లిపాయ‌లు తీసుకోకూడ‌దు. అలాగే గ్ర‌హ దోషాల‌తో బాధ‌ప‌డే వారు సోమ‌వారం నిత్యం శివ‌నామ‌స్మ‌ర‌ణ‌లోనే ఉండాలి. ఈ విధంగా శివుడికి ఇష్ట‌మైన పూల‌తో పూజించ‌డం వ‌ల్ల మ‌న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ని స‌క‌ల శుభాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM