Lord Hanuman With Suvarchala : హ‌నుమంతుడు త‌న భార్య‌తో కొలువై ఉన్న ఏకైక దేవాల‌యం.. తెలంగాణ‌లో ఉంది.. ఎక్క‌డంటే..?

April 24, 2024 6:08 PM

Lord Hanuman With Suvarchala : శ్రీరాముడి యొక్క అతి పెద్ద భక్తుడిగా ప‌రిగ‌ణించ‌బ‌డే హ‌నుమంతుడు మ‌నంద‌రికి బాల బ్ర‌హ్మ‌చారిగా తెలుసు. ఈ భూమిపై అమ‌ర‌త్వం పొందిన ఏడుగురు ఋషుల‌ల్లో హ‌నుమంతుడు కూడా ఉన్నాడు. విశ్వ‌మంతా హ‌నుమంతుడిని బ్ర‌హ్మ‌చారిగా ప‌రిగ‌ణిస్తుంది. కానీ హ‌నుమంతుడు వివాహం చేసుకున్నాడ‌ని రుజువు చేసే ఆల‌యాలు కూడా ఉన్నాయి. భార‌త దేశంలో కొన్ని ప్రాంతాల్లో హ‌నుమంతుడిని వివాహితుడిగా ప‌రిగ‌ణిస్తారు. తెలంగాణాలో హ‌నుమంతుడిని వివాహితుడిగా భావించే ఒక ఆల‌యం ఉంది. హైద‌రాబాద్ నుండి 220 కి.మీ దూరంలో ఖ‌మ్మం జిల్లాలో హ‌నుమంతుడు అత‌ని భార్య సువ‌ర్చ‌ల దేవాల‌యం ఉంది. ఇది పురాత‌న దేవాల‌యం. ఇక్క‌డ హ‌నుమంతుడు అత‌ని భార్య సువ‌ర్చ‌ల విగ్ర‌హాలు ఉన్నాయి.

ఈ దేవాల‌యాన్ని ద‌ర్శించుకున్న వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోవ‌డంతో పాటు భార్య భ‌ర్త‌ల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతుందని న‌మ్ముతారు. ఇక పురాణాల ప్ర‌కారం హ‌నుమంతుడి భార్య సువ‌ర్చ‌ల సూర్య‌భ‌గ‌వానుడి కుమార్తె. ప‌రాశ‌ర సంహితంలో హ‌నుమంతుడు మ‌రియు సువ‌ర్చ‌ల వివాహ క‌థ కూడా ఉంది. పురాణాల ప్ర‌కారం హ‌నుమంతుడు సూర్య‌భ‌గ‌వానుడి నుండి జ్ఞానాన్ని పొందుతాడు. సూర్య భ‌గ‌వానుడికి 9 విద్య‌ల‌లో జ్ఞానం ఉంది. అత‌ను హ‌నుమంతుడికి 5 విద్య‌ల జ్ఞానాన్ని మాత్ర‌మే భోదిస్తాడు. మిగిలిన విద్య‌ల‌ల్లో జ్ఞానాన్ని పొందాలంటే హ‌నుమంతుడు వివాహం చేసుకోవాలి. లేదంటే అత‌ను జ్ఞానాన్ని పొంద‌లేడు. కానీ హ‌నుమంతుడు బ్ర‌హ్మ‌చారి.

Lord Hanuman With Suvarchala the one and only temple in telangana
Lord Hanuman With Suvarchala

అప్పుడు సూర్య‌భ‌గ‌వానుడు ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని క‌నుగొన్నాడు. త‌న శ‌క్తితో ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చి సువ‌ర్చ‌ల అని పేరు పెట్టాడు. సువ‌ర్చ‌ల‌ను పెళ్లి చేసుకోమ‌ని సూర్య‌భ‌గ‌వానుడు హ‌నుమంతుడిని కోరాడు. వివాహం చేసుకున్న త‌రువాత సువ‌ర్చ‌ల త‌ప‌స్సులో మునిగిపోతుంద‌ని క‌నుక నీ బ్ర‌హ్మ‌చ‌ర్యానికి ఎటువంటి ఆటంకం ఉండ‌ద‌ని సూర్య‌భ‌గ‌వానుడు చెప్ప‌డంతో హ‌నుమంతుడు సువ‌ర్చ‌ల‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న త‌రువాత సువ‌ర్చ‌ల త‌ప‌స్సులో మునిగిపోయింది. దీంతో వివాహం చేసుకున్న‌ప్ప‌టికి హ‌నుమంతుడు బ్ర‌హ్మ‌చారిగా ఉండిపోయాడు. వివాహం చేసుకున్న‌ప్ప‌టికి హ‌నుమంతుడి బ్ర‌హ్మ‌చ‌ర్యానికి ఎటువంటి ఆటంకం క‌ల‌గ‌లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now