Lord Hanuman : హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఒక్కటి హనుమంతుడు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..? వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు.
ఇక ఆంజనేయుడు బాల్యం నుంచీ చిలిపివాడే. అసలే నిమిషమైనా కుదురుగా ఉండలేడు. దానికి తోడు శివుని తేజము, వాయుదేవుని అంశ, కేసరి శక్తి ఉండనే ఉన్నాయి. దాంతో ఆయనను పట్టడం సాధ్యమయ్యేది కాదు. ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది. ఎర్రగా, గుండ్రంగా, తళతళలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు ఆంజనీపుత్రుడు. వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు. వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ అందులో ఉన్న ప్రమాదం గోచరించలేదు.
అందుకనే ఆంజనేయుని చుట్టూ చల్లటి గాలులను వీస్తూ, అతనికి వేడి తగలకుండా కాచుకున్నాడు. పైగా ఆ రోజు సూర్యగ్రహణం. దాంతో సూర్యుని తీక్షణత సైతం తక్కువగా ఉంది. ఒకవైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతుంటే, మరోవైపు నుంచీ సూర్యుని చెరపట్టేందుకు రాహువు పొంచుకు రాసాగాడు. కానీ హనుమంతుని చూసిన రాహువుకి మతిపోయింది. తాను సూర్యుని భక్షించేలోపే మరో రాహువు అందుకు సిద్ధపడటం ఏమిటి..? అని కంగారు పడిపోయాడు. వెంటనే వెనుతిరిగి ఇంద్రలోకం వైపు పరుగులు తీశాడు. స్వామీ ఇవాళ నేను సూర్యుని గ్రహించడం సాధ్యమయ్యేట్లు లేదు. మరో జీవి ఏదో సూర్యుని భక్షించేందుకు దూసుకువస్తోంది.. అంటూ మొరపెట్టుకున్నాడు.
రాహువు మాటలు విన్న ఇంద్రునికి పట్టరాని కోపం వచ్చింది. సృష్టి ధర్మానికి విరుద్ధంగా, పంచభూతాలను సైతం తోసిరాజని ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలనుకున్నాడు. అమిత శక్తిమంతమైన తన వజ్రాయుధాన్ని విడిచాడు. ఇంద్రుని వజ్రాయుధానికి తిరుగేముంది, అది నేరుగా ఆంజనేయుని దవడకు తగిలింది. ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్ఛరిల్లాడు. కుమారుడి అవస్థ చూసిన వాయుదేవునికి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది. వెంటనే ముల్లోకాల నుంచీ తన పవనాలను ఉపసంహరించుకున్నాడు. వాయువు లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది.
ఈ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చెంతకు చేరుకున్నారు. బ్రహ్మ చేతి స్వర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు. అదిగో అప్పటి నుంచీ ఆంజనేయుడు.. హనుమంతుడు అన్న పేరుని సాధించాడు. హను (దవడ) దెబ్బతిన్నది కనుక హనుమంతుడు అయ్యాడు. అలా హనుమగా మారి సకల భక్తులచే పూజలందుకుంటున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…