Lemon Garland To Maa Kaali : ప్రతీ ఊళ్ళో కూడా అమ్మవారి ఆలయాలు ఉంటాయి. దుర్గా దేవి ఆలయం అని, గ్రామ దేవత ఆలయం అని ఇలా ఎన్నో అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. అయితే అమ్మవారిని మనం ఎప్పుడైనా గమనించినట్లయితే, అమ్మ వారికి నిమ్మకాయల దండల్ని వేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లోనే కాదు బోనాలు పండగ, దసరా పండుగ వంటివి జరిగినప్పుడు కూడా అమ్మవారికి నిమ్మకాయ దండల్ని వేస్తూ ఉంటారు. అయితే ఎందుకు అమ్మవారికి నిమ్మకాయ దండలు వేస్తారు..? దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
చాలా మంది కారణాలు ఏమిటి అనేది తెలుసుకోకుండా, పూర్వీకులు పాటించారు మనము పాటించాలని అలానే వారు కూడా పాటిస్తూ ఉంటారు తప్ప ఎందుకు అలా చేస్తున్నారు అనేది పట్టించుకోరు. కానీ నిజానికి ఇలాంటి పురాతన పద్ధతుల వెనుక పెద్ద కారణమే ఉంటుంది. ఎక్కువగా నిమ్మకాయ దండల్ని గ్రామ దేవతలకి వేస్తూ ఉంటారు.
లక్ష్మీ దేవి, సరస్వతి దేవి కి ఇలాంటి దండల్ని వేయరు. శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు, రక్షణ బాధ్యతల్ని కలిగి ఉంటుంది. నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లయకారిణి శక్తి కదా అమ్మవారు, కాలస్వరూపమై దుష్టశక్తుల పాలిట సింహ స్వప్నమైన దేవికి తామస గుణం ఉంటుంది. అయితే అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె బలిప్రియ. అంటే బలి కోరుతుందన్నమాట.
ఆ బలికి మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సు కి ప్రతీక కూష్మాండం. అంటే గుమ్మడికాయ. అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటాము. అలానే అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండని, పులుపుగా ఉండే పులిహార ని కూడా నైవేద్యంగా పెడతాము. అలా చేస్తే, అమ్మవారు శాంతిస్తారు. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం జరుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…