Kushmanda Deeparadhana : చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం కోసం కూడా చూస్తూ ఉంటారు. గ్రహ దోషం, రుణ దోషం, శత్రు దోషం, వాస్తు దోషం ఇలా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే, అటువంటి వాళ్ళు బుడద గుమ్మడికాయతో దీపారాధన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది, ఇటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి. మరి ఇక ఇటువంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలి, వాటి పరిహారాల గురించి చూద్దాం. పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అని పిలుస్తారు. కృష్ణాష్టమి, కాలాష్టమి అని కూడా అంటారు.
కాలభైరవ స్వామికి ఈ అష్టమి చాలా ఇష్టం. అందుకని కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన చేస్తే మంచిది. ముందు దీపం ఎలా పెడతారో చూద్దాం. గుడికి వెళ్లి ఇది చేయకూడదు. ఇంట్లో మాత్రమే చేసుకోవాలి. దృష్టి దోషం, నరఘోష, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ బాగా ఉండటం, లేదంటే పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే మంచి పరిహారం. ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో వాళ్లు బూడిద గుమ్మడికాయని మధ్యకి కొయ్యాలి. ఆ తర్వాత అందులోని గుజ్జుని తీసేసి, దానికి పసుపు కుంకుమ పెట్టాలి.
నువ్వుల నూనె పోసి పత్తితో కానీ గుడ్డతో కానీ వత్తి వేసి వెలిగించాలి. దాని కింద ఇత్తడి పళ్లెం పెట్టాలి. దీపారాధన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఇవన్నీ కూడా చేయాలి. ఆ తర్వాత వెలిగించిన బూడిద గుమ్మడి కాయకి నమస్కరించుకుని ముందు తల్లికి, తండ్రికి, గురువుకి, కుల దైవానికి, గ్రామదేవతకి, చండీమాతకి అలాగే ఆఖరిగా కాలభైరవ స్వామికి నమస్కారం చెప్పుకొని అప్పుడు ఇలా చెప్పుకోండి. నేను కూష్మాండ దీపారాధన చేస్తున్నాను జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు తొలగించి, సంతోషం, సౌభాగ్యం కావాలని కోరండి.
తర్వాత పంచోపచార పూజా చేసి అగరవత్తులు వెలిగించాలి. దీనిని గుమ్మడికాయకి గుచ్చండి. కాలభైరవ నామావళి లేదంటే అష్టకం చదువుకోవాలి. ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ధన యోగం కోసం అష్టమి నాడు, జనాకర్షణ కోసం అమావాస్యనాడు చేసుకోవాలి. ఈ దీపారాధన 19 అష్టమి తిథుల్లో కానీ 19 అమావాస్య తిథుల్లో కానీ చేస్తే మంచిది. పూజ అంతా అయిపోయాక ఎండు ఖర్జూరలని ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి. పూజ చేసిన నాడు ఉపవాసం ఉండాలి. ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. ఉదయం 4:30 నుండి 6 మధ్యలో చేసేయాలి. భక్తిశ్రద్ధలతో ఈ పూజ చేస్తే పూర్తి నరదృష్టి, గ్రహవాస్తు పీడలు తొలగిపోతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…