Kobbari Nune Deeparadhana : కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే.. ఎన్నో శుభఫలితాలు.. పైగా ఏ సమస్యా ఉండదు..!

June 28, 2023 5:40 PM

Kobbari Nune Deeparadhana : ప్రతిరోజు ఇంట్లో తప్పకుండా దీపం వెలగాలి. దీపారాధన చేస్తే చక్కటి ఫలితాలను పొందొచ్చు. చాలా మంది దీపాన్ని వెలిగించేటప్పుడు కొబ్బరి నూనెను, ఆవు నెయ్యిని, నువ్వుల నూనెని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొబ్బరి నూనెతో ఎక్కువ మంది దీపాన్ని రోజు వెలిగిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే, ఎలాంటి ఫలితాలను పొందొచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.

కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా, సంతోషంగా సాగుతుంది. అయితే కొబ్బరి నూనెతో దీపారాధన చేసేటప్పుడు రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకి పూజ చేసి, శ్రీ అశ్వదనారాయణ స్వామికి కొబ్బరి నూనెతో, దీపాన్ని పెడితే భార్యాభర్తల మధ్య సమస్యలు, చిక్కులు ఉండవు. సుఖంగా, సంతోషంగా దాంపత్య జీవితం సాగుతుంది.

Kobbari Nune Deeparadhana benefits in telugu
Kobbari Nune Deeparadhana

ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి, పంచదారని నైవేద్యంగా పెడితే శుభకార్యాలు ఆ ఇంట జరుగుతాయి. మహాలక్ష్మి దేవికి కూడా మీరు కొబ్బరి నూనెతో, దీపారాధన చేయడం మంచిది. 40 రోజులు పాటు మహాలక్ష్మి దేవికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పులన్నీ కూడా వసూలు చేసేయచ్చు. డబ్బు సమస్యలు ఉండవు. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ కుజదోషం ఉన్నవాళ్లు కొబ్బరి నూనెతో దీపాన్ని పెడితే, వివాహం త్వరగా అవుతుంది.

మీరు దీపారాధన చేసాక బొబ్బట్లని నైవేద్యంగా పెట్టి, 11 మంది ముత్తైదువులకి ఆ బొబ్బట్లు ఇస్తే చక్కటి ఫలితం ని పొందవచ్చు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కూడా మంచిది.. దీపారాధన చేసాక తులసి దళాలతో మాల కట్టి ప్రార్థించండి. అలా చేయడం వలన ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. కాశీ విశ్వేశ్వరుడికి సోమవారం రాత్రి హారతి ఇచ్చి, కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కోరుకున్నవి నెరవేరుతాయి. శ్రార్ధాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే, పితృదేవతలు స్వర్గలోకానికి వెళ్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now