Kamakshi Deepam : అఖండ ఐశ్వర్యాలు ఇచ్చే కామాక్షి దీపం.. అసలు ఎలా పెట్టాలి..?

June 27, 2023 8:08 PM

Kamakshi Deepam : ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఇంట్లో దీపాన్ని పెడుతూ ఉంటారు. దీపాన్ని వెలిగించడం వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. చాలా మంది వివిధ రకాలుగా దీపారాధన చేస్తూ ఉంటారు. దేవుడికి దీపం పెట్టి దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపాలలో కామాక్షీ దీపానికి విలువ ఎంతో ఉంది. కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.

కామాక్షీ దీపం అంటే ఏమిటి..? అసలు కామాక్షీ దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి లాభాలను పొందొచ్చు అని ముఖ్య విషయాలు చూసేయండి. కామాక్షీ దీపం అంటే దీపం పెట్టే ప్రమిదకి గజలక్ష్మి చిత్రం ఉంటుంది. అందుకే కామాక్షీ దీపాన్నే గజలక్ష్మి దీపం అని కూడా పిలుస్తారు. సర్వ దేవతలకి శక్తినిచ్చే తల్లి కామాక్షీ దేవి. కామాక్షీ దేవి ఆలయాన్ని తెల్లవారుజామున అన్ని ఆలయాల కంటే ముందే తెరుస్తారు.

Kamakshi Deepam how to put it and light it
Kamakshi Deepam

రాత్రిపూట అయితే, అన్ని దేవాలయాలని మూసినా తర్వాతే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. కామాక్షీ దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతుందో, ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. కామాక్షీ దీపాన్ని ఖరీదైన నగలతో సమానంగా భావిస్తారు. అంటే అంత విలువైనది అన్నమాట. ఇళ్లల్లో వ్రతాలు చేసినప్పుడు, గృహప్రవేశం చేసినప్పుడు, అఖండ దీపాన్ని పెట్టినప్పుడు కామాక్షీ దీపాన్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు.

అమ్మవారి రూపును ఈ దీపం కలిగి ఉంటుంది. ఇక కామాక్షీ దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయానికి వచ్చేస్తే… దీపారాధన చేసేటప్పుడు దీపానికి కుంకుమ పెట్టాలి. కామాక్షీ దీపాన్ని ఉపయోగించేటప్పుడు ప్రమిదకి కుంకుమ పెట్టిన తర్వాత అమ్మ వారి రూపానికి కూడా కుంకుమ పెట్టి, పువ్వులతో అలంకరించాలి. అక్షింతలు వేసి అమ్మవారిని కొలవాలి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు మీకు కలుగుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment