మన భారతీయులు వాస్తుశాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు అనే విషయం మనకు తెలిసిందే.చిన్న పని నుంచి మొదలుకొని పెద్ద పెద్ద పనులను చేసేటప్పుడు వాస్తును పరిశీలించి ఆ పనులను చేస్తారు.ఏ మాత్రం వాస్తు లోపం ఉన్న మన ఇంటి పై నెగిటివ్ ప్రభావం ఏర్పడి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ముందుగానే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువును సమకూర్చుకుంటారు.
వాస్తు శాస్త్రంలో దోషాలు కూడా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసినదే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పువ్వులకు కూడా దోషాలు ఉంటాయని మీకు తెలుసా. పువ్వులకు దోషాలు ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..పువ్వులకు కూడా దోషాలు ఉంటాయి అలాంటి పువ్వులను మనం ఇంటికి తెచ్చుకుంటే లేదా అలాంటి పువ్వులు పూసే చెట్లు మన ఇంట్లో ఉంటే పెద్ద ఎత్తున మనం నష్టపోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా మనం పూల మొక్కలను పెంచుతూ ఉంటాము. అయితే వాటిని సరిగ్గా చూసుకొని సమయంలో అవి ఎండిపోయి వాడిపోతూ ఉంటాయి. ఈ విధంగా వాడి పోతున్నప్పటికీ ఆ మొక్కల నుంచి పుష్పాలు వికసిస్తాయి. ఈ విధమైన వాడిపోయిన మొక్కల నుంచి పుష్పించే పుష్పాలను ఇంటిలోకి తీసుకురావడం వల్ల ఆ మొక్క పై పడిన ప్రభావం మన ఇంటి పై కూడా పడుతుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా వాడిపోయిన నీరసించి పోయిన పుష్పాలతో ఎల్లప్పుడూ కూడా పూజ చేయకూడదు. ఎప్పుడు తాజాగా ఉండే పుష్పాలతో పూజ చేయటం వల్ల ఆ దేవతల అనుగ్రహం మనపై ఉంటుంది.ఎట్టి పరిస్థితులలో కూడా వాడిపోయిన పుష్పాలతో పూజ చేయకూడదని అలాంటి పుష్పాలను ఇంటికి తీసుకురాకూడదు అని పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…