Good Things To See For Luck : ఇంటి నుంచి ముఖ్యమైన పనులకు బ‌య‌ట‌కు వెళ్లేటప్పుడు వీటిని చూస్తే శుభం కలుగుతుంది..!

August 10, 2021 2:12 PM

Good Things To See For Luck : సాధారణంగా కొందరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు కొందరు ఎదురు వస్తే ఆ పనులను అక్కడితో విరమించుకుంటారు.అదేవిధంగా కొన్ని వస్తువులు కనిపించిన మనం వెళ్లే పనులలో ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయని భావిస్తారు.మరి మనం ఇప్పటినుంచి ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి వస్తువులు మన కంటికి కనిపిస్తే శుభం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మనం ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు నిండుగా ఉన్నటువంటి నీటి బిందెలు, నీటి బకెట్లు కనిపించిన మనం వెళ్లే పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. బయటకు వెళ్ళేటప్పుడు పాలు కనబడితే శుభ ఫలితాలు కలుగుతాయి. పెళ్లి పనుల నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు పాలు తాగుతున్నటువంటి ఆవు దూడ కనిపిస్తే ఆ పని సక్రమంగా నెరవేరుతుంది.

ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మితే అపశకునంగా భావిస్తారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, వాతావరణ పరిస్థితులు బాగున్నా తుమ్ము వస్తే అది శుభసూచికం. అయితే ఒకటి కన్నా ఎక్కువ తుమ్ములు వస్తే మన పనిలో ఆటంకం కలుగుతుంది. మనం బయటకు వెళ్లేటప్పుడు గుడిగంటలు వినిపిస్తే శుభం కలుగుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తమలపాకు చెట్టును, ఏనుగు బొమ్మను, చూసి వెళ్లడం వల్ల శుభం కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now