Temple : ప్రతి రోజు లేదా వారానికి ఒకసారి ఎవరి అలవాట్ల ప్రకారం వారు గుడికి వెళ్తూనే ఉంటారు. కొంతమంది ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి వెళ్తే మరి కొంతమంది మానసిక ప్రశాంతతకోసం గుడికెళ్తారు. గుడికి వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అలా కాకుండా గుడికి వెళ్లినప్పడు పాటించాల్సిన నియమాలు తెలుసుకుంటే ఇకపై అలా చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమాలు తెలుసుకోండి. తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా తీసుకోవాలి. వెంట వెంటనే మూడు సార్లు ఒకేసారి తీసుకోకూడదు.
ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో రెండు ఒత్తులను చేసి వెలిగించాలి. ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపం ముఖం ఉండాలి. సాయంత్రం పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమరగా ఉండాలి. వినాయకునికి ఒకటి, ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు, విష్ణు మూర్తికి నాలుగు, మర్రిచెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రసాదాన్ని తినకుండా పారేయకూడదు. దీపాన్ని నోటితో ఆర్పకూడదు. ఒక దీపం వెలిగించి రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించకూడదు. దీపం వెలిగించి వెంటనే బయటికి వెళ్లకూడదు.
దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. దేవుని పూజకు ఉపయోగించే ఆసనం వేరొక పనికి వాడరాదు. పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయకూడదు. స్త్రీలు మోకాళ్ళపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యన నడవకూడదు.
ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామని దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి, తరువాత ఆపాదమస్తకము దర్శించాలి. స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…