ఆధ్యాత్మికం

అష్టైశ్వర్యాలు కలగాలంటే ప్రతి రోజూ ఉదయం పాలు కాచే ముందు ఈ నియమాలు తప్పనిసరి..!

చాలామంది వారికి జీవితంలో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సాగిపోవాలని.. సంపదలు కలసి రావాలని భావిస్తారు. ఈ క్రమంలోనే డబ్బులను సంపాదిస్తుంటారు. ఇలా డబ్బులను సంపాదిస్తున్నప్పటికీ కొంత మంది దగ్గర ఏ మాత్రం డబ్బు నిల్వ ఉండదు. ఇలా చేతిలో డబ్బు నిల్వలేని వారు కొన్ని పనులను చేయటం వల్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మనకు సంపద కలగాలని లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాము. మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాలని పండితులు తెలియజేస్తున్నారు.

మహిళలు ప్రతి రోజూ ఉదయం లేవగానే పాలు కాచడం అలవాటుగా ఉంటుంది. పాలు కాచే ముందు నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది కనుక పాలను కూడా సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ క్రమంలోనే పాలను కాచే ముందు.. ముందుగా పొయ్యిని (స్టవ్‌ని) శుభ్రం చేసుకొని గంధం, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి నమస్కరించుకోవాలి. ఇలా చేసిన అనంతరం పాలు కాచాలి.

అదే విధంగా చాలా మంది పాలను పొయ్యిపై పొంగిస్తుంటారు. ఇలా పాలు పొంగిన తర్వాత పాలలో రెండు బియ్యపు గింజలు వేస్తే అంతా శుభం జరుగుతుంది. అలాగే తొందరగా పాలు చల్లారాలని చాలా మంది పాలు కాగిన తర్వాత పాలపై ఉన్న మూతను తొలగిస్తారు. అలా చేయడం వల్ల పాల నుంచి ఆవిరి ఏ విధంగా అయితే బయటకు వెళ్తుందో అదే విధంగా మన ఇంట్లో ఉన్న సంపద మొత్తం వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. కనుక పాలు కాచే సమయంలో ఈ నియమాలను పాటించడం వల్ల మనం సంపాదించుకున్న డబ్బు వృథా ఖర్చు కాకుండా మన సంపదను వృద్ధి చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM