ఆధ్యాత్మికం

భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌నులు ఏంటో తెలుసా..?

భార్య గ‌ర్భంతో ఉందంటే చాలు భ‌ర్త ఎంతో సంతోషిస్తాడు. భ‌ర్తే కాదు, అత‌ని త‌ర‌ఫు వారు, ఆమె తర‌ఫు వారు ఎంతో సంద‌డి చేస్తారు. ప్ర‌ధానంగా హిందువుల్లో అయితే శ్రీ‌మంతం వంటి శుభ‌కార్యాలు నిర్వ‌హిస్తారు. అయితే భార్య గ‌ర్భం దాల్చిన‌ప్పుడు ఆ వ‌ర్గానికి చెందిన కొన్ని విశ్వాసాల ప్ర‌కారం భ‌ర్త ప‌లు ప‌నులు చేయ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే అరిష్ట‌మ‌ని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి స‌మ‌యంలో భ‌ర్తలు చేయకూడ‌ని ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త స‌ముద్ర స్నానం చేయ‌కూడ‌దు. అలాగే చెట్ల‌ను కూడా న‌ర‌క‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే పుట్టే బిడ్డ‌కు అరిష్టం క‌లుగుతుంద‌ట‌. భార్య గ‌ర్భం దాల్చాక ఆరు నెల‌ల స‌మ‌యం త‌రువాత భర్త క‌టింగ్ అస్స‌లు చేయించుకోకూడ‌దు. క‌నీసం షేవింగ్ కూడా చేసుకోకూడ‌దు. శ్మ‌శానాల‌కు శవాల‌ను తీసుకెళ్లే అంతిమ యాత్ర‌లో శ‌వాలను మోయ‌కూడ‌దు. అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుంద‌ట‌. భార్య ప్రెగ్నెంట్ అయ్యాక భ‌ర్త విదేశీ ప్ర‌యాణాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ట‌. అస్స‌లు ఆమెను విడిచి దూరంగా పోకూడ‌ద‌ట‌. భార్య గర్భం దాల్చిన 7వ‌ నెల మొదలైనప్పటి నుండి తీర్థయాత్రల‌కు వెళ్ల‌కూడ‌ద‌ట‌. అలాగే ప‌డ‌వ‌లను ఎక్కకూడ‌ద‌ట‌.

పర్వతారోహణము చేయ‌కూడ‌దు. యుద్దము చేయ‌డం మానేయాలి. ఇంటికి స్తంభ ముహూర్తము పెట్టించ‌కూడ‌దు. గృహ ప్ర‌వేశం చేయ‌కూడ‌దు. వాస్తుక‌ర్మ నిర్వ‌హించ‌రాదు. ఈ ప‌నుల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది. శవాన్ని అనుసరించి వెళ్ళరాదు. అంటే శ‌వ‌యాత్ర‌లోనూ పాల్గొన‌రాదు. దీంతోపాటు ప్రేత కర్మలు చేయకూడద‌ట. ఇంకా ఉపశమనం, పిండదానం వంటి పనులు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ట‌. పైన చెప్పినవి భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌నులు. అలాగే చేయాల్సిన పని ఒక‌టి ఉంది. అదేమిటంటే.. ఆ స‌మ‌యంలో భార్య ఏది అడిగితే అది భ‌ర్త తెచ్చివ్వాల‌ట‌. అలా చేస్తేనే ఆమె సంతోషంగా ఉండి త‌ద్వారా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంద‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM