Garuda Puranam : ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చేయాలి..? గ‌రుడ పురాణంలో చెప్పిన సూచ‌న‌లు..!

April 20, 2023 3:20 PM

Garuda Puranam : భూమిపై పుట్టిన ప్రతి ఒక్క జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. కాకపోతే ఒక జీవి ముందు, ఒక జీవి తరువాత చనిపోతుంది. అందుకు మనిషి కూడా అతీతుడు కాదు. మనిషైనా ఏదో ఒక రోజున ఎలాగోలా చనిపోవాల్సిందే. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ.. మనిషి జీవిత కాలాన్ని మాత్రం నిజంగా ఆపవచ్చు. అంటే.. చావు నుంచి తప్పించుకోవడం అని కాదు. కానీ చావును కొంత ఆలస్యంగా వచ్చేలా చేయడం అన్నమాట. అంటే.. కొంత ఎక్కువ కాలం జీవించడం అని మనం తెలుసుకోవాలి. మరి అలా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి..? అంటే.. ఇందుకు మీ వద్ద సమాధానం ఉండకపోవచ్చు. కానీ గరుడ పురాణం మాత్రం అందుకు సమాధానాలు చెబుతోంది. మరి ఆ సమాధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

గరుడ పురాణంలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే కదా. మనిషి తన జీవిత కాలంలో చేసే ఆయా పనులకు నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయో అందులో క్లియర్‌గా రాసి ఉంటుంది. అయితే కేవలం ఇదే విషయం మాత్రమే కాకుండా మనిషి జీవిత కాలం పెరగాలంటే ఏం చేయాలో కూడా అందులో రాసి ఉంది. మరి మన జీవిత కాలాన్ని పెంచుకునేందుకు గరుడ పురాణం ప్రకారం ఎలాంటి సూచనలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

how to increase life according to Garuda Puranam
Garuda Puranam

రాత్రి పూట భోజనంలో ఎవరూ కూడా పెరుగు తినరాదు. ఎందుకంటే ఇది ఆ సమయంలో సరిగ్గా జీర్ణం కాదట. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చి జీవిత కాలం, ఆయుర్దాయం తగ్గిపోతుందట. కనుక రాత్రి పూట పెరుగు తినరాదు. రాత్రి పూట చాలా మంది డిన్నర్‌ చేయగానే వెంటనే నిద్రపోతారు. కానీ అలా చేయరాదట. తిన్న వెంటనే నిద్రిస్తే అనారోగ్యాలు కలిగి జీవిత కాలం తగ్గుతుందట. కాబట్టి తిన్న వెంటనే నిద్రపోరాదు. రాత్రి పూట మాంసాహారం తినరాదు. తింటే అది సరిగ్గా జీర్ణం కాక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. దీంతో అనారోగ్యం కారణంగా మనిషి ఆయుర్దాయం తగ్గుతుంది. త్వరగా చనిపోతాడు. కనుక రాత్రి పూట మాంసాహారం మానేస్తే జీవిత కాలాన్ని, ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు.

కొందరు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి అవి జీవిత కాలాన్ని తగ్గిస్తాయట. కనుక ఎవరైనా ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. ఆలస్యం చేయకూడదు. ఇక ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఆ సమయంలో వచ్చే గాలిని పీల్చుకుంటే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయట. శ్మశానాల్లో దహన కార్యక్రమాలను నిర్వహించగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండే బాక్టీరియాలు మన శరీరాల్లోకి వెళితే అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. వాటి వల్ల మనం త్వరగా చనిపోవాల్సి వస్తుంది. దీంతో జీవిత కాలం తగ్గుతుంది. కనుక ఎవరైనా ఎక్కువ కాలం జీవించాలంటే.. శ్మశానాల్లో దహన కార్యక్రమాలు ముగియగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి. అక్కడే వెయిట్‌ చేయరాదు.

ఇక చివరిగా గరుడ పురాణం ప్రకారం.. భార్యాభర్త ఎవరైనా రాత్రి పూటే శృంగారంలో పాల్గొనాలట. ఉదయం చేయకూడదట. చేస్తే ఆయుష్షు తగ్గుతుందని, ఆ సమయంలో మనిషి శరీర రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొంటే వచ్చే అనారోగ్య సమస్యలు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. కనుక దంపతులు రాత్రి పూటే శృంగారంలో పాల్గొంటే మంచిది. ఆయుష్షు పెరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now