దేవుడి ఉంగరం చేతి వేలికి ధరిస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పనిసరి!

January 14, 2022 9:02 AM

సాధారణంగా ఉంగరాలు చేతికి ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి. ఈ క్రమంలోనే చాలామంది ఎంతో స్టైల్ గా ఉండే ఉంగరాలను చేతివేళ్లకు ధరిస్తారు. అయితే చాలామంది భగవంతుడిపై నమ్మకంతో వారి ఇష్టదైవాన్ని ఉంగరం రూపంలో లేదా లాకెట్ రూపంలో ధరిస్తారు. అయితే కొందరు జాతక దోషాలు రీత్యా అందుకు అనుగుణంగా దేవుడి ఉంగరాలను చేతి వేలికి పెట్టుకుంటారు. అయితే దేవుడి ఉంగరాలను చేతి వేళ్లకు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో నియమ నిష్టలు పాటించాలి. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు.

దేవుడి ఉంగరం ధరించేవారు ఎప్పుడూ కూడా ఆ ఉంగరాన్ని కుడి చేతికి మాత్రమే ధరించాలి. అన్నం తినే సమయంలో అన్నం ఉంగరానికి అంటుకోకూడదు. అదేవిధంగా ఉంగరం ధరించేటప్పుడు స్వామివారి తల భాగం మన చేతి వైపు, అదేవిధంగా పాదాలు మన చేతి వేళ్ళ వైపు ఉండేలా ధరించాలి. పొరపాటున కూడా దేవుడి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరించకూడదు.

ఇక మహిళలు చాలామంది చేతికి దేవుడి ఉంగరాలతోపాటు మెడలో దేవుడి లాకెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే మహిళలు ప్రతి నెల నెలసరి సమయానికి ముందుగానే ఈ దేవుడి ఉంగరం, లాకెట్ తీసి పక్కన పెట్టాలి. అదే విధంగా ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే ఈ ఉంగరాలను కళ్ళకు అద్దుకొని నిద్రలేచే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు చేతి వేళ్ళను ముడుచుకొని ఆ ఉంగరం మన కళ్ళకు అద్దుకొని భగవంతుడిని నమస్కరించుకోవాలని పండితులు చెబుతున్నారు. దేవుడి ఉంగరాలను ధరించినప్పుడు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now