భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్దశి రోజు వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి విగ్రహాలను ప్రతిష్టించి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వచ్చింది. మరి ఈ పండుగ రోజు ఏ విధమైన పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు.. అనే విషయాలను తెలుసుకుందామా..!
వినాయక చవితి రోజు ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే వాళ్ళు సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలంటు స్నానం చేసి వినాయకుడి పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి. వినాయకుడిని ప్రతిష్ఠించి పూజా సమయం వరకు వినాయకుడి ముఖం కనిపించకుండా ఎర్రని వస్త్రం కప్పి వేయాలి. ముఖ్యంగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చే వారు స్వామివారి తొండం ఎడమవైపు ఉండేది తీసుకోవాలి. పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టే సమయంలో శుద్ధమైన గంగాజలంతో స్వామివారి విగ్రహాన్ని తుడిచి నుదుటిపై సిందూరం పెట్టి పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి. పూజ సమయంలో స్వామివారికి బంతి పువ్వులను సమర్పించి, స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారి అలంకరణ అనంతరం విఘ్నేశ్వరుని మంత్రాలను జపిస్తూ విగ్రహాన్ని 3, 5, 7, 9, 11 రోజుల పాటు ఇంట్లో ఉంచుకుని పూజ చేయవచ్చు. ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు దానధర్మాలు చేయడం వల్ల శుభం కలుగుతుంది. ఈ విధంగా వినాయకుడి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి.
వినాయక చవితి రోజు ఇంట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్టించే వారు ఎప్పుడు కూడా బాత్రూం గోడకు దగ్గరగా, మెయిన్ గేట్ ఎంట్రెన్స్ లో, ఇంట్లోకి ప్రవేశించే మార్గంలో, హాల్ లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించకూడదు. అదేవిధంగా నాట్యమాడుతూ ఉన్న వినాయక విగ్రహాన్ని తీసుకుని పూజ చేయకూడదు. ఇక వినాయకుడి నిమజ్జనం చేసే సమయంలో నేరుగా కుటుంబ సభ్యులు నిమజ్జనం చేయకుండా పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించే చోటపెట్టి ఆ వినాయకుడితో పాటు ఈ విగ్రహాలను నిమజ్జనం చేయాలి. అలాగే నిమజ్జనం చేసే సమయంలో స్వామివారి అలంకరణలో ఉపయోగించే పుష్పాలు అన్నింటినీ తొలగించే నిమజ్జనం చేయాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…