ఇంట్లో బాగా గొడ‌వ‌లు అవుతున్న వారు ఇలా చేస్తే చాలు.. స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది..!

August 2, 2021 2:55 PM

సాధారణంగా ఏ ఇంట్లో అయినా సమస్యలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే చిన్న చిన్న గొడవలు వస్తూపోతూ ఉంటాయి.కానీ కొన్నిసార్లు మనల్ని వెంటాడే సమస్యలు మనల్ని ఎంతో మానసికంగా కృంగ తీస్తాయి.ఇలా మానసిక ఆందోళన చెందినప్పుడు చిన్న విషయమే పెద్దదిగా కనపడి అనేక గొడవలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఇంట్లో భార్య భర్తలు తరచూ పోట్లాడటం వల్ల ఇంట్లో ప్రశాంతత కరువైపోతుంది.

ఈ విధంగా ఇంట్లో పెద్ద వారు తరచూ పోట్లాడటం వల్ల ఆ ప్రభావం ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలపై పడి వారికి జీవితం అంటేనే ఒక నెగెటివ్ అనే భావన కలుగుతుంది.ఈ క్రమంలోనే మన ఇంట్లో ప్రశాంతత కలగాలంటే ముందుగా మన ఇంట్లోకి వ్యాపించిన నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి పోవాలి. మరి మన ఇంట్లోకి వచ్చిన నెగటివ్ ఎనర్జీని పారద్రోలే శక్తి కల్లు ఉప్పుకి ఉంటుంది.

మన ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటే వారి పడకగదిలో ఒక గిన్నెలోకి కల్లు ఉప్పును నెలరోజులపాటు ఒకే స్థానంలో ఉంచాలి.నెల రోజుల తర్వాత ఆ ఉప్పు బయటకు పడేసి వెంటనే స్నానం చేసి ఇష్టదైవానికి పూజ చేయాలి.పూజ అనంతరం మరొక గిన్నెలో ఉప్పును తీసుకొని అదే స్థానంలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈక్రమంలోనే తరచూ గొడవలు జరగడం తగ్గి ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now