శుక్ర‌వారం రోజు ఈ జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..!

May 16, 2023 12:37 PM

శుక్రవారం రోజు మంచి పనులు చేయడంతోపాటు మరికొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు. ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంద‌ట‌. కాబట్టి శుక్రవారం రోజు ఏ పనులు చేయకూడదో ఒకసారి చూద్దాం.

ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన దాని ప్రకారం శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్ట‌మైన‌ రోజు. ఈ రోజు మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తే మీ ఇంటికి సంపద, వైభవం వస్తుందని చెబుతున్నారు. అందుకే శుక్రవారం రోజు దానాలు, ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా మనల్ని ఎప్పుడూ ధనవంతులుగా ఉండేలా ఆశీర్వదిస్తుంది.

follow these rules on friday for luck and wealth

శుక్రవారం రోజు ఇంట్లో పగిలిపోయిన లక్ష్మీ దేవి విగ్రహాలు ఉంటే నిమజ్జనం లాంటివి చేయకూడదు. సాయంత్రం సమయంలో ప్రార్థన చేసే ముందు మన ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు ఎవరి దగ్గర రుణం తీసుకోవద్దు, ఇవ్వవద్దు. ఈ విధంగా చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంద‌ని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే శుక్ర‌వారం రోజు ఇంటి పెద్ద కొడుకు శిరోజాలు, గోర్ల‌ను క‌త్తిరించ‌కూడ‌దు. అలా చేస్తే సంప‌ద‌ను పోగొట్టుకుంటార‌ని అంటున్నారు. క‌నుక ఈ జాగ్ర‌త్త‌ల‌ను వ‌హించ‌డం మంచిది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment