ల‌క్ష్మీదేవి క‌టాక్షం క‌ల‌గాల‌న్నా.. అదృష్టం ప‌ట్టాల‌న్నా.. ఇవ‌న్నీ చేయండి..!

August 29, 2023 3:21 PM

ప్రతి ఒక్కరు కూడా అంతా మంచే జరగాలని భావిస్తారు. అందుకోసం ఏదో ఒక పరిష్కారాన్ని పాటిస్తారు. మీ ఇంట్లో అంతా మంచే జరగాలని అనుకుంటే కచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది. ఇంటి ముఖద్వారానికి ఒక మంచి రోజు చూసుకుని లక్ష్మీదేవి ఫోటోని పెట్టండి. లక్ష్మీదేవి వెనుక రెండు ఏనుగులు, బంగారపు కలశాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నట్లు ఉంచండి. ఇలా చేయడం వలన ఎలాంటి పనుల్లో కూడా ఆటంకం ఉండదు.

ఒక కొబ్బరికాయని తీసుకుని ఏడు సార్లు ఏడు దారాలు చుట్టి మీ చుట్టూ ఏడుసార్లు దానిని తిప్పుకోండి. పైనుండి కింద వరకు తిప్పి ఒక మంచి రోజు చూసుకుని ఇలా చేశారంటే అదృష్ట సమయంలో కలిగే ఆటంకాలని తొలగించుకోవచ్చు. ఏడు శుక్రవారాలు, ఏడుగురు ముత్తైదువులకి ఇంటి గృహిణి కుంకుమ, పసుపు, చందనం, తాంబూలం, ఎరుపు రంగు జాకెట్ క్లాత్‌, దక్షిణని కానుకగా ఇస్తే ఆ ఇంటికి ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆ ఇంట ఉంటుంది.

follow these remedies to get blessings from lakshmi devi

ఎప్పుడూ కూడా డస్ట్ బిన్ ని మూత లేకుండా ఉండకూడదు. అలాగే పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. సాయంత్రం, ఉదయం లైట్లు వేశాక ఇల్లు తుడవకూడదు. గోమతి చక్రాలను మూడు తీసుకుని వాటిని పొడి చేసి, ఒక రోజు ఇంటి ముందర చల్లాలి. ఇలా చేస్తే మీకు ఆర్ధిక బాధలు వుండవు. తొలగిపోతాయి.

గోమతి చక్రాన్ని కుంకుమ భరిణ‌లో పెట్టి మూత పెట్టేయాలి. దీనిని దేవుడి మందిరంలో పెట్టాలి. అలా చేయడం వలన ఇంట్లో ఎలాంటి బాధలు కూడా ఉండవు. ప్రతి నెల అమావాస్య నాడు ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన మీకు అంతా శుభమే కలుగుతుంది. ఆర్థిక బాధలు వంటివి కూడా పోతాయి. సంతోషంగా ఉండవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now