Alakshmi : హిందువులు లక్ష్మీ దేవిని ఎంతగా పూజిస్తారో అందరికీ తెలిసిందే. తమకు ధనం సిద్దించాలని, అదృష్టం కలగాలని, ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కలగాలని ఆమెను వారు ప్రార్థిస్తారు. ఈ క్రమంలో కొందరికి కోరుకున్నట్టుగానే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే అది ఓకే.. లక్ష్మీ దేవిని చాలా మంది పూజిస్తారు, ఆమె గురించి అందరికీ తెలుసు. కానీ ఆమె అక్క గురించి మీకు తెలుసా..? అవును, ఆవిడ కూడా ఉంది. ఆమె పేరు అలక్ష్మి. అయితే శ్రీమహావిష్ణువు ఆమెకు పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడ్డాడట. ఇంతకీ అసలు కథ ఏమిటంటే..
దేవతలు, రాక్షసులు ఆదిశేషువును తాడుగా చేసుకుని, మందర పర్వత్వాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మధిస్తారు. అప్పుడు దాంట్లో నుంచి అనేక వస్తువులు మాత్రమే కాదు, దేవతలు కూడా ఉద్భవిస్తారు. వారిలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది. దీంతో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తాడు. అయితే లక్ష్మీదేవి అందుకు నిరాకరిస్తుంది. కారణం అడగ్గా.. తన కన్నా ముందు పెళ్లి కాని అక్క ఉందని ఆమెకు పెళ్లి అయితేనే తాను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. దీంతో విష్ణువు లక్ష్మీదేవి అక్క అయిన అలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తాడు. అయితే ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోరు. అవును, ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం నిలవదట. ధనం ఆగదట. పోతూనే ఉంటుందట. మరి అలాంటప్పుడు తెలిసి తెలిసి ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి.
అయితే వెతగ్గా వెతగ్గా అలక్ష్మికి ఓ వరుడు దొరుకుతాడు. అతను ఉద్దాలకుడు. ఆయన ఓ మహాముని. ఆయన అలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. దీంతో కథ సుఖాంతం అవుతుంది. ఆ తరువాత లక్ష్మీ దేవి విష్ణువును పరిణయమాడుతుంది. అయితే ఉద్దాలకుడితో వెళ్లిన అలక్ష్మి ఆయన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం వద్దే ఆగుతుంది. ఎందుకని అడగ్గా, తాను శుభ్రంగా ఇంట్లో ఉండనని, మురికిగా, అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటానని, దుస్తులు కూడా అలాగే ఉండాలని చెబుతుంది. అంటే.. ఏ ఇంట్లో అయితే మురికిగా, అశుభ్రంగా ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉంటుందట. అంటే.. ఆ ఇంట్లో డబ్బు నిలవదని మనకు తెలుస్తుంది. అందుకే ఎవరైనా తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి. అప్పుడే లక్ష్మి నిలుస్తుంది.
అంతేకాదు.. ఇళ్ల గుమ్మాల్లో మిరపకాయలు, నిమ్మకాలను గుత్తిగా వేలాడదీసి గుమ్మాలకు కడతారు కదా..! అది కూడా అలక్ష్మి కోసమేనట. ఇంటి వద్దకు వచ్చిన అలక్ష్మికి ఆ ఆహారం అంటే ఇష్టమట. పుల్లగా, వగరుగా, కారంగా ఉండే ఆహారం అంటే ఆమె ఇష్టపడుతుందట. అందుకనే వాటిని గుమ్మాల వద్ద వేలాడదీస్తారు. ఈ క్రమంలో ఒక వేళ అలక్ష్మి వస్తే వాటిని తిని ఇక ఆ ఇంట్లోకి వెళ్లకుండా బయటికి పోతుందని అందరూ నమ్ముతారు. అందుకే ఆ వస్తువులను చాలా మంది ఇళ్లు మాత్రమే కాదు, ఆఫీసులు, షాపుల్లోనూ బయట వేలాడదీస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…