Naga Devatha : నాగదేవతలను ఇలా పూజిస్తే.. కాల సర్ప దోషం ఉండదు.. సర్ప భయం పోతుంది..

August 17, 2023 10:00 PM

Naga Devatha : హిందువులకు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు. వారిలో నాగదేవత కూడా ఉంది. నాగదేవతను కూడా చాలా మంది పూజిస్తుంటారు. శివాలయాల్లో మనకు నాగదేవతలకు చెందిన విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే కాక నాగదేవతలకు ప్రత్యేకంగా ఆలయాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి ఏడాది నాగ పంచమి నాడు నాగదేవతలను పూజిస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి స్నానం చేసి నైవేద్యం వండి పుట్ట వద్దకు వచ్చి పాలు పోస్తారు. గుడ్లను, ఇతర పదార్థాలను నైవేద్యంగా పెడతారు. దీంతో నాగదేవత ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే కేవలం నాగ పంచమి నాడే కాదు.. ఏడాదిలో ఎప్పుడైనా సరే మనం నాగ దేవతకు పూజలు చేయవచ్చు. అయితే నాగదేవతను ఎలా పూజించాలో తెలియక చాలా మంది సందేహిస్తుంటారు. ఈ క్రమంలోనే నాగ దేవతను ఎలా పూజించాలి, ఏమేం పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్ల పక్షం 5వ రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు నాగదేవత విగ్రహాన్ని పాలతో అభిషేకం చేస్తారు. అలాగే పాములను కూడా పూజిస్తారు. నాగ పంచమి రోజు పాములను పూజిస్తే జాతకంలో ఉన్న కాల సర్ప దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. నాగ పంచమి నాడు నాగ పూజ చేయడం వల్ల జాతకంలో ఉండే నల్ల పాము దోషాన్ని కూడా తొలగించుకోవచ్చు.

do pooja to Naga Devatha like this for many benefits
Naga Devatha

నాగ పంచమి రోజు మంచి ముహుర్తం సాధారణంగా ఉదయాన్నే ఉంటుంది. ఆ కాలంలో నాగదేవతను పూజిస్తే అన్ని సర్ప దోషాలు తొలగిపోతాయి. అనుకున్నవి నెరవేరుతాయి. ముఖ్యంగా సంతానం లేని వారు ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. నాగ దేవతను చందనం, పువ్వులు, ధూపం, పచ్చిపాలు, పాయసం, నెయ్యితో పూజించాలి. అలాగే పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఆ అన్నదానంలో తీపి ఉండాలి. అలాగే వారికి ఎంతో కొంత డబ్బు ఇస్తే ఇంకా మంచిది.

ఇక రాశి చక్రంలో రాహు, కేతువుల కారణంగా వచ్చే దోషాన్ని కాల సర్ప దోషం అంటారు. ఇది పలు రకాలుగా ఉంటుంది. కానీ నాగ పంచమి నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే కాల సర్ప దోషం నుంచి బయట పడవచ్చు.

కాల సర్ప దోషాలు చాలా హానికరమైనవని చెప్పవచ్చు. ఇవి విపరీతమైన పరిణామాలను కలగజేస్తాయి. ముఖ్యంగా సంతానం ఉండదు. అలాగే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి. మీ జాతకంలో కాల సర్ప దోషం ఉంటే నాగ పంచమి నాడు తప్పక పూజలు చేయండి. అలాగే వీలు కుదిరినప్పుడు త్రయంబకేశ్వరం వెళ్లి పూజలు చేస్తే మంచిది. ఇక నాగ పంచమి నాడు శివుడికి రుద్రాభిషేకం చేస్తే మంచిది. నాగ పంచమి నాడు వెండితో తయారు చేసిన పాములను దానం ఇవ్వాలి. దీంతో అంతా మంచే జరుగుతుంది. కాల సర్ప దోషం పోతుంది.

సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా గరుడ గోవింద ఆలయానికి వెండితో చేసిన ఒక జాత నాగులను సమర్పించండి. పంచాక్షరీ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రాలను నాగ పంచమి నాడు 108 సార్లు జపించాలి. దీంతో సర్ప భయం పోతుంది. కాల సర్ప దోషం నుంచి గట్టెక్కుతారు. నాగపంచమి నాడు రాహువుకు చెందిన బీజ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నాగ పంచమి నాడు అశోక వృక్షానికి పూజ చేసి నీరు పోయాలి. ఇది అత్యంత ఫలవంతమైన ఫలితాన్ని అందిస్తుంది.

నాగ పంచమి నాడు ఉపవాసం ఉండి 11 కొబ్బరికాయలను శ్రీకృష్ణుని పేరున నీటిలో నిమజ్జనం చేయాలి. పంచమి నాడు కుదరకపోతే శనివారం చేయవచ్చు. దీంతో నాగదోషం తొలగిపోతుంది. అలాగే లోహంతో చేసిన 108 జతల నాగ, నాగినిలను శనివారం నది నీటిలో వదలాలి. గాయత్రీ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఎలాంటి కాల సర్ప దోషం అయినా సరే పోతుంది. ఈ విధంగా సర్ప దోషాల నుంచి బయట పడవచ్చు. సమస్యల నుంచి గట్టెక్కుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now