Cheepuru : చీపురుని ఇంట్లో ఇలా పెట్టిండి.. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..!

July 15, 2023 8:22 AM

Cheepuru : చీపురుని లక్ష్మీ దేవిగా కొలుస్తారు. కచ్చితంగా చీపురుకి సంబంధించి కొన్ని విషయాలని పాటించాలి. ఇంట్లో చీపురు ఏ దిశలో పెడితే మంచిది.. ఎలా మనం చీపురుకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇల్లు తుడుచుకునే గుడ్డ, చీపురు వంటివి చాలా ముఖ్యం. చీపురును అస్సలు కాలితో తన్నకూడదు. చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావించాలి.

చీపురు ని ఇంట్లో ఒక మూల మనం నిలబెడుతూ ఉంటాము. ఇంట్లో చీపురుని నిలబెట్టేటప్పుడు చీపురు తుడిచే భాగం కింద ఉండాలి. చేత్తో పట్టుకునే భాగం పైకి ఉండాలి. కానీ చాలామంది రివర్స్ లో పెడుతూ ఉంటారు. అది తప్పు. ఎప్పుడూ కూడా చీపురుని నిలబెట్టేటప్పుడు, చేతితో పట్టుకునే భాగం పైకే ఉండాలి. ఒకవేళ కనుక చీపురు పాడైపోతుంది ఇలా పెడితే అని అనుకునే వాళ్లు, చీపురుని ఎక్కడైనా గోడకి ఫిక్స్ చేసుకోవచ్చు.

do not make these mistakes with Cheepuru
Cheepuru

మనం చీపురుని ఎలా పెట్టినా కూడా అప్పుడు చీపురు పాడవదు. ఒకవేళ ఏదీ కుదరకపోతే చీపురుని పడుకోబెట్టడం కూడా పరవాలేదు. కానీ ఆఖరిన ఇలా చేయండి. ఏదీ కుదరకపోతే ఇలా చేయొచ్చు. చీపురుని ఏ గదిలో పెట్టుకోవాలనేదానికి ఎటువంటి నియమాలు లేవు.

ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఈశాన్యం మూలలో మాత్రం చీపురుని పెట్టకండి. అలానే చీపురు కనపడకుండా ఉండాలి అనే నియమం కూడా లేదు. ఎక్కడైనా సరే చీపురుని మనం పెట్టొచ్చు. చీపురుని మాత్రం కాలితో తొక్కకూడదు. కాలికి అసలు చీపురు తగలకూడదు. చీపురుతో ఒకరిని కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. లక్ష్మీ స్వరూపం అయిన చీపురుకి సంబంధించి ముఖ్య విషయాలని చూసారు కదా.. మరి ఇక మీదట ఈ తప్పులు ఏమి చేయకుండా చూసుకోండి. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now