సాయంత్రం సమయంలో ఈ వస్తువులను పొరపాటున కూడా దానం చేయకండి..!

August 6, 2021 4:00 PM

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది.సరైన సమయానికి మన ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్లి తీసుకు రావడం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగడం వంటివి చేస్తుంటారు. అయితే దానమివ్వడం మంచిదే కానీ సాయంత్ర సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సూర్యాస్తమయం అయిన తరువాత ఎవరైనా మన ఇంటికి వచ్చి పసుపును దానం అడిగితే ఇవ్వకండి. పసుపు దానం చేయడం వల్ల మన సంపద తగ్గడానికి కారణమవుతుంది. అదే విధంగా ఎవరికి కూడా అప్పుగా సంధ్యాసమయంలో డబ్బులు ఇవ్వకూడదు. ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సూర్యాస్తమయం అయిన తర్వాత వేరొకరి గడియారం మనం చేతికి వేసుకోకూడదు. ఇలా వేసుకోవడం వల్ల వారికున్నటువంటి చెడు మనకు వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక సంధ్యా సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా ఇతరులకు దానమివ్వకూడదు.ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఎలాంటి పరిస్థితులలో కూడా ఉప్పును ఇతరులకు దానం ఇవ్వకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now