Lakshmi Devi : శుక్రవారం నాడు కచ్చితంగా వీటిని ఆచరించండి.. మీకు అంతా మంచే జరుగుతుంది..!

November 4, 2023 5:53 PM

Lakshmi Devi : శుక్రవారం నాడు ఇది చేయకూడదు. అది చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ, చాలామందికి, క్లియర్ గా ఈ విషయాలు తెలియవు. శుక్రవారం నాడు, మరి ఏఏ పనులు చేయొచ్చు..? ఏఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడే తెలుసుకుందాం. శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజిస్తే, చాలా మంచి జరుగుతుంది. మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలని, దుర్గా దేవికి శుక్రవారం సమర్పిస్తే, ఈతి బాధలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకుంటే, తులసిమాల వేయండి.

ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు, వెన్న ముద్దతో ఆలయానికి వెళ్ళండి. అప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇతరుల అగ్గిపెట్టి తీసుకుని కానీ దీపాన్ని తీసుకుని కానీ వెలిగించడం మంచిది కాదు. ఈ పుణ్యఫలం మీకు దక్కకుండా, ఇతరులకి దక్కుతుంది. శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే, గరిక మాల తీసుకువెళ్లాలి.

do like this on friday for Lakshmi Devi blessings
Lakshmi Devi

గరిక మాల అంటే, వినాయకుడికి ఎంతో ఇష్టం. శుక్రవారంనాడు శివాలయానికి వెళ్తే, బిల్వపత్రాలను తీసుకువెళ్లండి. కష్టాలు తొలగిపోతాయి. సర్వ శుభాలు కలుగుతాయి. నుదుట కుంకుమ బొట్టు కచ్చితంగా పెట్టుకోవాలి. పసుపు, కుంకుమలని నుదుట కుంకుమ కింద విభూతిని మొదట బొట్టు పైన పెట్టుకోవాలి. శుక్రవారం ఉదయం తలస్నానం చేసి, పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవాలి.

ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, అమ్మవారిని దర్శించుకోవాలి. నేతితో దీపం పెడితే, సుమంగళి ప్రాప్తిస్తుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. అలానే, శుక్రవారంనాడు పాలతో చేసిన పాయసం తాగితే, ఆరోగ్యానికి మంచిది. మహిళలు తెల్లటి పువ్వులని, తలలో పెట్టుకోవడం వలన, శుభ ఫలితం ఉంటుంది. ఇలా, శుక్రవారంనాడు వీటిని ఆచరించినట్లయితే, మంచి జరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now