Evening : కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ అనుకున్నది సాధించలేకపోతుంటారు. అలా జరగడానికి కారణం పనిచేసే చోటు అవ్వచ్చు. లేదంటే నివసించే చోటు అవ్వచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో జయం, అపజయం రెండు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం అస్సలు విజయమే అందదు. ఎప్పుడు చూసినా అపజయాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడూ మీకు కూడా అపజయాలే కలుగుతున్నట్లయితే ఇలా చేసుకోండి. ఒకసారి వాస్తు ఎలా ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. పరిహారాలు కూడా చేసుకోవడం మంచిది.
సూర్యాస్తమయం సమయంలో ఈ పరిహారాలు చేస్తే ధనవంతులు అవ్వచ్చు. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాల కోసం అందరూ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కష్టపడి పని చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి గ్రహచారం సరిగా లేక అదృష్టం కలిసి రాదు. వాస్తు సరిగా లేకపోయినా కూడా నష్టం ఉంటుంది. అయితే ఇటువంటి వాటి నుండి ఎలా విముక్తి పొందాలి..? బయటికి ఎలా రావాలి..? అనే విషయాన్ని తెలుసుకుందాం.
హిందూ ధర్మంలో ఉదయ సంధ్య, సాయం సంధ్య రెండూ కూడా ముఖ్యమైనవి. ఈ సమయంలో కొన్ని పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలో తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సంధ్య వేళలో అస్సలు నిద్రపోకూడదు. సంధ్య వేళలో నిద్రపోతే లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుంది. సాయంకాలం చేసే పూజకి ఎంతో మహత్తు ఉంటుంది. సాయంత్రం సమయంలో పూజ మందిరంలో తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి.
ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వెలుగు ఉండాలి. చీకటి నెగెటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తే కష్టాలు వస్తాయి. మనశ్శాంతి ఉండదు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చీకటి లేకుండా చూసుకోవాలి. సూర్యాస్తమయం సమయంలో పెద్ద వాళ్ళని తలుచుకుని వారి యొక్క దీవెనల కోసం వేడుకోవాలి. వారి దీవెనలు లేకపోతే అడుగడుగునా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా మీరు వీటిని పాటిస్తే కష్టాలు తొలగిపోతాయి. ఐశ్వర్యం, అదృష్టం మీ వెంటే ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…