Deeparadhana : హిందూ సాంప్రదాయంలో దేవుళ్లను పూజించే పద్ధతుల్లో అనేక విధానాలున్నాయి. పూవులను వాడడం, అగరుబత్తీలు వెలిగించడం, ధూపం, దీపం.. ఇలా అనేక మంది తమ అనుకూలతలను బట్టి దేవుళ్లను పూజిస్తారు. అయితే ఎవరు దేవున్ని పూజించినా దీపారాధన చేయకుండా పూజనైతే ముగించరు. ఎందుకంటే దీపంలో ఉండే వెలుగు దైవానికి చిహ్నం కాబట్టి. దీపంతో దేవున్ని ఆరాధిస్తే శాంతి కలుగుతుంది. శుభం చేకూరుతుంది. అందుకే చాలా మంది దీపారాధన విషయంలో శ్రద్ధను కనబరుస్తారు కూడా.
అయితే సాధారణంగా ఎవరు దీపారాధన చేసినా దీపంలో వత్తులను ఒక సంఖ్య ప్రకారం పెట్టి ఆరాధిస్తారు. కానీ అలా కాకుండా భక్తులు తాము పుట్టిన తేదీలకు అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో వత్తులతో దీపారాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుందట. అన్నీ శుభాలే చేకూరుతాయట. ఈ క్రమంలో జన్మతేదీలకు అనుగుణంగా ఏయే తేదీల్లో పుట్టిన వారు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 తేదీల మధ్య జన్మించిన వారు 5 వత్తులతో దీపారాధాన చేయాలి. ఏప్రిల్ 21 నుంచి మే 20 మధ్య పుట్టిన వారు 7 వత్తులతో దీపం వెలిగించాలి. మే 21 నుంచి జూన్ 20 మధ్య పుట్టిన వారు 6 వత్తులతో దీపం వెలిగిస్తే మంచిది. జూన్ 21 నుంచి జూలై 20 మధ్య జన్మించిన వారు 5 వత్తులతో దీపం వెలిగించాలి. జూలై 21 నుంచి ఆగస్టు 20 మధ్య పుట్టిన వారు 3 వత్తులతో దీపారాధన చేయాలి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య పుట్టిన వారు 6 వత్తులతో దీపం వెలిగించాలి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 మధ్య పుట్టిన వారు 7 వత్తులతో దీపారాధాన చేయాలి.
అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 మధ్య జన్మించిన వారు 2 వత్తులతో దీపం వెలిగించాలి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 మధ్య పుట్టిన వారైతే 5 వత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 20 మధ్య వారైతే 6 వత్తులతో దీపం వెలిగించాలి. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పుట్టిన వారు 6 వత్తులతో దీపం వెలిగించాలి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 20 మధ్య జన్మించిన వారు 2 వత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దేవుళ్లకు దీపారాధన చేస్తే దాంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. దీని వల్ల భక్తులకు అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…