మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం పాటిస్తున్నాం. కానీ వాటి వెనుక కారణాలు మనకి తెలియదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఆ ఏడాది అంతా పూజలు చేయరు. అలానే పండుగలు కూడా జరుపుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే, పూజలు ఏడాది మొత్తం చేసుకోకూడదా.. ఈ సందేహం చాలా మందిలో ఉంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే, ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి. కొంతమంది ఇళ్లల్లో అయితే ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఏ పూజలు చేయరు.
ఎటువంటి పండగలు కూడా జరపరు. ఇంకొందరైతే ఏడాది మొత్తం దేవుడి గుడికి వెళ్ళరు. అలానే దేవుడి గది తలుపులు కూడా మూసేసి ఉంచుతారు. ఇంట్లో పూజలు, శుభకార్యాలు కానీ పండగలు కానీ, దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం ఇవేమీ ఉండవు. అయితే ఎవరైనా చనిపోతే దీపారాధన చేయడం మానక్కర్లేదు. ఎందుకంటే దీపారాధన చెయ్యని ఇల్లు శ్మశానంతో సమానం. ఎప్పుడూ కూడా దీపారాధన జరిగే చోటికి దేవుళ్ళు వస్తూ ఉంటారు.
అందుకే ప్రతిరోజు కూడా దీపం పెట్టాలి. అప్పుడే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో, సౌభాగ్యాలతో ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే, దహన సంస్కారాలు ముగిసిన తర్వాత 11 రోజులు పాటు దీపారాధన చేయడం శుభకార్యాలు చేసుకోవడం పూజలు చేయడం వంటివి చేయకూడదు. 11 రోజులు మాత్రమే ఇలా పాటించాలి. తర్వాత 12వ రోజు నుండి శుభస్వీకారం జరుగుతుంది. 11 రోజుల తర్వాత కచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. అయితే సంవత్సరం పొడవునా ఎక్కడికీ వెళ్ళకూడదని, గుడిలో పూజలు చేయకూడదని, ఇళ్ళల్లో పూజలు చేయకూడదని ఏమీ లేదు.
దీపారాధన చేసుకోవచ్చు. చెయ్యాలి. నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో దేవతలు తిష్ట వేసుకుని కూర్చుంటారు. దీప, ధూప నైవేద్యాలు లేకుండా పూజ గదిని అలా వదిలేయడం, తలుపులు మూసేసి ఉంచడం వంటివి చేయడం తప్పు. అలాంటి ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. దోషాలు కూడా తగులుతాయి. కాబట్టి కచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దీపారాధన చేయడం మానేయకండి. ఇంట్లో ఏడాది లోపే శుభకార్యాలు కూడా చేయాలని శాస్త్రాలు, పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…