Temple : ఆలయం పక్కన ఇల్లు కట్టుకోకూడదా..? ఉంటే ఏమ‌వుతుంది..?

July 18, 2023 3:48 PM

Temple : ఎన్నో ఆలయాలు ఉంటూ ఉంటాయి. మన ఇంటికి దగ్గరలోనే చాలా ఆలయాలు ఉంటాయి. అయితే మనలో చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది వాస్తుని పట్టించుకోవడం లేదు. అయితే కొందరు పట్టించుకోకపోయినప్పటికీ చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు చూసి తర్వాత ఇల్లుని కట్టుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం, ఇంట్లో సామాన్లని పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వీటి మీద ఆధారపడి ఉన్నాయి.

మన పెద్దలైతే ఇంటిని దేవాలయంతో పోలుస్తారు. వంటగదిని పాకమందిరము అని.. స్నానం చేసే గదిని స్నాన మందిరం అని అనేవారు. అయితే చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే ఆలయానికి దగ్గర ఇల్లు ఉండొచ్చా..? ఆలయానికి సమీపంలో ఇల్లు కట్టుకుంటే మంచిదా కాదా అని.. అయితే నిజానికి ఆలయానికి సమీపంలో, అనగా దేవాలయం నీడ, ధ్వజస్తంభం నీడ పడే చోట ఇంటిని కట్టుకోవడం మంచిది కాదని శాస్త్రం అంటోంది.

can be build house near Temple
Temple

దేవాలయాల నీడ ఇంటి మీద ఎప్పుడు పడకూడదట. ఆలయ నీడ ఇంటిపై పడితే ఐశ్వర్యం పోతుంది. రోగాలు వస్తాయి. ఆయువు క్షీణిస్తుంది. ఎంతవరకు కట్టుకోకూడదు అంటే, యజమాని కుడి చేతిని ముందుకు చాచి, ఎడమ భుజం చివరి భాగం వరకు ఒక హస్త ప్రమాణం తీసుకోవాలి. అంతవరకు కట్టుకోకపోవడం మంచిది. శివాలయం పక్కన 100 బారల లోపు ఇల్లు ఉండకూడదు. విష్ణు ఆలయం వెనుక భాగం గృహ నిర్మాణం చేయకూడదు.

వైష్ణవాలయానికి వెనుక 100 బారలు, ముందు 50 బారలు వదిలేసి అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. కనీసం 20 బారలు అయినా వదిలేయాలి. శక్తి ఆలయానికి కుడి, ఎడమవైపు ఇల్లు కట్టుకోకూడదు. శక్తి ఆలయానికి 120 బారల వరకు ఇల్లు కట్టుకోకుండా ఉంటే మంచిది. ఆంజనేయ స్వామి ఆలయానికి ఎనిమిది బారల వరకు కట్టుకోకూడదు. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన విషయాలని. వీటిని పాటిస్తే అంతా మంచే జరుగుతుంది. తెలియకుండా అనవసరంగా ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now