ఇంట్లో శంకువును ఇలా పూజిస్తే.. అన్నీ శుభాలే కలుగుతాయి..!

February 24, 2022 2:30 PM

సాధారణంగా హిందూ సాంప్రదాయాలలో దైవారాధనకు శంకువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అభిషేకాలలో తప్పకుండా శంకును ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. దైవారాధనలో శంఖానికి ప్రాధాన్యత ఉందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ శంఖాన్ని ఇంటిలో ఉంచి పూజ చేసుకోవచ్చా ? లేదా ? అనే సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి. ఇంట్లో శంఖాన్ని ఉంచి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం శంకువు సముద్రగర్భం నుంచి పుట్టిందని చెబుతారు. ఇటువంటి శంఖాన్ని మన ఇంట్లో ఉంచి పూజ చేయడం వల్ల మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. తెల్లటి శంఖాన్ని మన ఇంట్లో ఉంచి పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అదేవిధంగా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

శంఖాన్ని శుభ్రమైన నీటితో కడిగి పసుపు, కుంకుమతో అలంకరించాలి. ఈ శంఖాన్ని వెండి పాత్రలో బియ్యం పోసి అందులో ఉంచి పూజించాలి. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజు శంఖానికి పాలతో అభిషేకం చేసి పూజ చేయటం వల్ల సర్వపాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కనుక శంఖాన్ని ఇంట్లో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment