Bangles : భారతీయ మహిళలు గాజులను ధరించడం ఎప్పుడో పురాతన కాలం నుంచే సాంప్రదాయంగా వస్తోంది. గాజులను మహిళ వైవాహిక జీవితానికి నిదర్శనంగా భావిస్తారు. పెళ్లి కాని వారైతే అందం, ఆకర్షణ కోసం ధరిస్తారు. అయితే కేవలం ఇవే కాదు, గాజులను ధరించడం వెనుక మనకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
భారతీయ ఆచార వ్యవహారాల, నమ్మకాల ప్రకారం బంగారు, వెండి ఆభరణాలు మహిళలకు శక్తినిస్తాయి. చేతులపై బంగారు గాజులు ధరించడం వల్ల ఎముకలకు దృఢత్వం చేకూరుతుంది. అంతేకాదు ఇవి నిరంతరం దేహానికి తగులుతూ ఉండడం వల్ల వాటిలోని సూక్ష్మ పదార్థాలు, అణువులు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఇలాంటి బంగారు, వెండి అణువులు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
గాజులను ధరిస్తే మహిళలు వారి భర్తలు ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని మతాల్లో నమ్ముతారు. గాజులు లేకపోతే అలంకరణ అసంపూర్తిగా ఉన్నట్టేనని హిందువుల్లో అధిక శాతం మంది నమ్ముతారు. మహిళలు గాజులను ఎల్లప్పుడూ ధరించి ఉండడం వల్ల వాటి ద్వారా వచ్చే శబ్దాలు ఇండ్లలో ఉండే దుష్ట శక్తులను తరుముతాయని హిందూ సాంప్రదాయంలో నమ్ముతారు. అంతేకాదు గాజుల శబ్దాలు ఎక్కువగా ఉంటే ఆ నివాసం దైవానికి నెలవని నమ్ముతారు.
పురాతన కాలంలో మహిళలు పరపురుషులను చూడాల్సి వస్తే వారి ముఖాలను చేతులు లేదా వస్త్రంతో కప్పుకునేవారు. దీనికి అనుగుణంగానే ఇతర పురుషులు మహిళలకు గౌరవం ఇచ్చేవారు. అదే సమయంలో మహిళ కనిపించకుండా గాజుల శబ్దమైనా కూడా పురుషులు అప్రమత్తమై వారికి కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్త పడేవారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…