Angaraka And Lord Shiva : అంగార‌కుడికి, ప‌ర‌మ శివుడికి మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటి..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

August 23, 2023 3:55 PM

Angaraka And Lord Shiva : నవగ్రహాలకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టత ఉంది. అంగారక గ్రహానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని రాశులు వాళ్లు కూడా అంగారకుడి అనుగ్రహాన్ని కోరుకుంటుంటారు. పురాణాల ప్రకారం శివుడి దయ వలన అంగారకుడు పుట్టాడట. అందుకని అంగారకుడిని మాతృమూర్తి అని అంటారు. మన భారతదేశంలో నవగ్రహాలకి ఎంతో విశిష్టత వుంది. నవగ్రహాలకి ఆలయాలు కూడా ఉన్నాయి.

అంగారక గ్రహం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ గ్రహం ఎర్రగా ఉండడానికి, ఆలయాలకి చాలా దగ్గర సంబంధం ఉందట. అంగారక దోషం ఉండేవాళ్లు ఆ గ్రహ విముక్తి కోసం ఆలయాలకి వస్తూ ఉంటారు. ఇక వివరాలలోకి వెళితే.. స్కంద పురాణంలోని అవంతిక ఖండం ప్రకారం తన రక్తం నుండి వందలాది రాక్షసులు పుడతారని అంధకాసురుడు అనే రాక్షసుడికి శివుడు వరం ఇస్తాడు.

Angaraka And Lord Shiva what is the relationship between them
Angaraka And Lord Shiva

ఆ తర్వాత భక్తుల బాధల్ని తొలగించడానికి శివుడు స్వయంగా అంధకాసురుడుతో యుద్ధం చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య భీకర యుద్దం మొదలవుతుంది. ఈ పోరాటంలో శివుడి చెమట ధారలుగా ప్రవహిస్తుంది. ఆ చెమట వేడి వలన ఉజ్జయినిలో నేల రెండు కింద విడిపోతుంది. అలా అంగారక గ్రహం పుట్టింది. అక్కడ అంగారకుడు, రాక్షసుడి రక్తపు చుక్కల్ని శివుడు చూశాడు. ఆ సమయంలో అంగారకుడు ఉన్న భూమి ఎరుపు రంగులో ఉందట.

చాలా ఆలయాల్లో అంగారకుడిని పరమేశ్వరుడి అవతారంగా భావించి కొలుస్తారు. ఇలా అంగారకుడిని ప్రార్థించడం వలన జాతకంలో మంగళ దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. అంగారక చతుర్థి నాడు పరమేశ్వరుడి ఆలయాల్లో యజ్ఞ యాగాలు నిర్వహిస్తుంటారు. ఉజ్జయినిలో ఈ ఆలయం ఉంది. మంగళనాధ్ దేవాలయం అని అంటారు. మత్స్య పురాణం, స్కంద పురాణంలో అంగారకుడి గురించి పూర్తిగా వివరించబడి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now