Work From Home Scam : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ స్కామ్‌.. 4 రోజుల్లో రూ.54 ల‌క్ష‌లు పోగొట్టుకున్న మ‌హిళ‌..

May 17, 2024 11:30 AM

Work From Home Scam : సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌స్తుత త‌రుణంలో ఎంత‌గా ఉందో అంద‌రికీ తెలిసిందే. అయితే దీన్ని ఆస‌ర‌గా చేసుకుని చాలా మంది నెటిజ‌న్ల‌ను మోసం చేస్తున్నారు. సింపుల్ టాస్కుల‌ను చేస్తే చాలు.. డ‌బ్బులు వ‌స్తాయ‌ని చెప్పి నమ్మిస్తున్నారు. ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇంట్లో కూర్చునే సంపాదించ‌వ‌చ్చ‌ని ఆశ పుట్టిస్తున్నారు. ఇది నిజ‌మే అని న‌మ్మిన చాలా మంది ఇప్ప‌టికే ఎన్నో కోట్ల రూపాయ‌ల‌ను పోగొట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఇంకా ఇలాంటి మాయ‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకుంటూనే ఉన్నారు. ల‌క్ష‌లాది రూపాయ‌ల‌ను న‌ష్ట‌పోతున్నారు. ఇక తాజాగా ముంబైలో ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ముంబైకి చెందిన 37 ఏళ్ల ఓ మ‌హిళ గ‌ర్భం ధ‌రించి మెట‌ర్నిటీ లీవ్‌లో ఉంది. ఆమె అక్క‌డి న‌వీ ముంబైలోని ఐరోలి అనే ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే లీవ్‌లో ఉన్న‌ప్ప‌టికీ ఆన్‌లైన్ ద్వారా డ‌బ్బులు సంపాదించే మార్గాల కోసం వెత‌క‌సాగింది. ఈ క్ర‌మంలోనే ఆమె మాయ‌గాళ్ల ట్రాప్‌లో ప‌డింది. ఆమె కొంద‌రిని సోష‌ల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయింది. సింపుల్ టాస్కుల‌ను చేస్తే చాలు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌ని వారు న‌మ్మ‌బ‌లికారు. దీంతో ఆమె నిజ‌మే అని నమ్మి ప‌లు ద‌ఫాలుగా వారి అకౌంట్ల‌లో మొత్తం రూ.54 ల‌క్ష‌ల‌ను జ‌మ చేసింది. మొత్తం న‌లుగురికి చెందిన అకౌంట్ల‌కు ఆమె న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది.

Work From Home Scam how a woman lost rs 54 lakhs in just 4 days
Work From Home Scam

ఆమె న‌గ‌దు జ‌మ చేశాక అవ‌త‌లి వ్య‌క్తులు కొన్ని రోజుల పాటు ప‌లు టాస్కుల‌ను ఇచ్చారు. రెస్టారెంట్ల‌కు రేటింగ్స్ ఇస్తే భారీ ఎత్తున డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని చెప్పారు. దీంతో ఆమె వారు చెప్పిన టాస్కుల‌ను పూర్తి చేసింది. అయితే చివ‌ర‌కు వారు స్పందించ‌లేదు. దీంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు పోలీసులు స‌ద‌రు న‌లుగురు అప‌రిచిత వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు ఇలాంటి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ జాబ్స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, చిన్న టాస్కుల‌ను చేస్తే ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదించ‌వ‌చ్చ‌ని ఎవ‌రైనా చెబితే అస‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని వారు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now