దారుణం.. 18 నెల‌ల కొడుకును చిత‌క‌బాదుతూ చెంప దెబ్బ‌లు కొట్టిన త‌ల్లి.. ఎప్పుడూ చిత్ర‌హింస‌లే..

September 2, 2021 10:09 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న 18 నెల‌ల కొడుకును త‌ల్లి చిత్ర హింస‌లు పెట్ట‌సాగింది. కొడుకును ఎప్పుడూ చిత‌క‌బాదుతూ, వీపుపై దెబ్బ‌లు కొడుతూ, చెంప దెబ్బ‌లు కొడుతూ ఉండేది. అయితే ఆ క‌సాయి త‌ల్లి బారి నుంచి ఎట్ట‌కేల‌కు ఆ బాలున్ని ర‌క్షించ‌గ‌లిగారు. వివ‌రాల్లోకి వెళితే..

దారుణం.. 18 నెల‌ల కొడుకును చిత‌క‌బాదుతూ చెంప దెబ్బ‌లు కొట్టిన త‌ల్లి.. ఎప్పుడూ చిత్ర‌హింస‌లే..

తమిళ‌నాడులోని వ‌ల్లిపురంకు చెందిన వ‌డివ‌ళ‌గ‌న్‌కు, ఏపీకి చెందిన తుల‌సి అనే మ‌హిళ‌కు 5 ఏళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే తుల‌సి ఎప్పుడూ ఫోన్‌లో వేరే వ్య‌క్తితో మాట్లాడుతుండేది. అది గ‌మ‌నించిన భ‌ర్త ఆమెను వారించాడు. దీంతో కోప‌గించుకున్న ఆమె అత‌నితో గొడ‌వ ప‌డుతుండేది.

చివ‌ర‌కు భార్య ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన భ‌ర్త ఆమెను పిల్ల‌ల‌తో స‌హా ఏపీలోని పుట్టింట్లో వ‌దిలిపెట్టాడు. కానీ అక్క‌డ తుల‌సి త‌న 18 నెల‌ల కొడుకును చిత్ర‌హింస‌లు పెట్ట‌సాగింది. అత‌న్ని తీవ్రంగా కొట్టేది. దీంతోపై వీపుపై ఎర్ర‌గా దెబ్బ‌లు ఉండేవి. చెంప దెబ్బ‌లు కొడుతుండేది. అయితే ఆమె కొట్టిన‌ప్పుడు రికార్డు చేసిన దృశ్యాల‌ను బంధువులు చూశారు. దీంతో ఆమె భ‌ర్త‌కు స‌మాచారం అందించారు.

ఆమె భ‌ర్త విష‌యం తెలుసుకుని పిల్ల‌ల‌ను త‌న వెంట తీసుకెళ్లాడు. త‌న భార్య‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు ఆమెపై ఐపీసీ సెక్ష‌న్లు 323, 355, 75 సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు ప్ర‌స్తుతం మాన‌సిక వైద్యుల‌చే కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now