మిద్దె పై మనవరాలిని ఎత్తుకొని బట్టలు ఆరవేస్తుండగా..!

August 11, 2021 3:02 PM

తన మనవరాలిని ఎత్తుకొని మిద్దె పై బట్టలు ఆరవేస్తుండగా విషాదం నెలకొంది. మిద్దె పై బట్టలు ఆరవేస్తున్న క్రమంలో తడి బట్టలు పక్కనే ఉన్న కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ కి గురై తల్లి కూతురు మనవరాలు మృతి చెందిన ఘటన సింగారపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన పిచ్చుమణి భార్య ఇంద్ర ఆమె కూతురు మహాలక్ష్మి. తన కూతురికి మిట్టపల్లికి చెందిన శివ అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడు సంవత్సరాల కూతురు ఉంది. ఇటీవల అత్తింటి నుంచి మహాలక్ష్మి తన కూతురితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇంద్రజ తన మనవరాలినెత్తుకుని మిద్దెపై బట్టలు ఆరేస్తూ ఉన్నారు.

బట్టలు ఆరేస్తున్న క్రమంలో తడి బట్టలు కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యారు.ఈ క్రమంలోనే ఇంద్రజ గట్టిగా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని మహాలక్ష్మి పరుగులు తీసింది. ఈ క్రమంలోని తన తల్లిని రక్షించే క్రమంలో మహాలక్ష్మి కూడా మృత్యువాత పడింది. ఈ విధంగా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now