సెల్ఫీ పేరుతో భార్యను కొండపై నుంచి తోసిన భర్త.. కారణం ఏమిటంటే?

August 14, 2021 10:17 PM

పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకుండానే భార్యపై భర్త అనుమానాలు పెంచుకున్నాడు. తన మాదిరిగానే తన భార్యకు మరొకరితో అక్రమసంబంధం ఉందని అనుమానించిన ఆ భర్త ఎలాగైనా తన భార్య అడ్డును తొలగించి తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం సెల్ఫి పేరుతో ఆమెను ఓ కొండపై నుంచి తోసి చంపిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకుంది. పొట్టి వివరాలలోకి వెళితే..

 

 

జిల్లాలోని చిన్నోని పల్లే గ్రామానికి చెందిన జయ రాములకు జిల్లెల గ్రామానికి చెందిన మద్దిలేటి శరణ్యకు గత రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే అప్పటికే జయరాములకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉండటం వల్ల ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలని చూశాడు. ఈ క్రమంలోనే ఆమె ఫోన్లో మాట్లాడిన ఆమెపై అనుమానం పడేవాడు. పథకం ప్రకారం తన భార్యను అడ్డు తప్పించి తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించిన జయరాములు తమ తల్లిదండ్రులతో ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలని చెప్పి తన భార్య శరణ్యను తీసుకు వెళ్ళాడు .

ఈ క్రమంలోనే గుడి పేరుతో సమీపంలో ఉన్న తిరుమలయ్య కొండకు తీసుకువెళ్లి అక్కడ సెల్ఫీ దిగడం కోసం కొండ అంచకు వెళ్లారు. ఈ క్రమంలోనే ముందుగా అనుకున్న ప్రకారం తనని కొండ పైనుంచి కిందకు తోసి నేరం తనపైకి రాకుండా తన అత్తమామలకు తమ కూతురు కనిపించలేదని ఫోన్ చేశాడు. అయితే తన మాటలు నమ్మని శరణ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు జయ రాములను కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పెట్టాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now