విధి అంటే అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులే మనకు మృత్యువును తెచ్చి పెడతాయి. ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరుగుతుందో తెలియదు. రోజూ బస్సులో ఆఫీసుకు వెళ్లే ఆమె కరోనా కర్ఫ్యూ విధించారని సొంత వాహనంపై వెళ్లింది. రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలై చనిపోయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లాకు చెందిన సంధ్య (23) అనే యువతి ఆర్‌డీవో కార్యాలయంలో పనిచేస్తోంది. అయితే ఏపీలో కరోనా కారణంగా కర్ఫ్యూను విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నింటికీ అనుమతులు ఇచ్చారు. మధ్యాహ్నం 12 దాటితే ప్రజా రవాణా కూడా అందుబాటులో లేదు. కాగా రోజూ బస్సులో ఆఫీస్‌కు వెళ్లే సంధ్య కర్ఫ్యూ ఉందని, ఇంటికి రావడం కష్టమవుతుందని చెప్పి సొంత వాహనం స్కూటీపై వెళ్లింది.
కానీ మార్గమధ్యలో ఆమెను మృత్యువు బలిగొంది. దగదర్తి లైన్స్ నగర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనం ఆమె స్కూటీని ఢీకొంది. దీంతో ఆమె స్కూటీ నుంచి పక్కకు ఎగిరి పడింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అయితే కరోనా భయంతో ఎవరూ ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆమె కొంత సేపు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడి మృతి చెందింది. కాగా పోలీసులు ఆ వాహనం డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. రోజూలాగే తమ కుమార్తె బస్సులో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆమె తల్లిదండ్రులు శోక సంద్రమయ్యారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…