దారుణం.. త‌ల్లి కుక్క‌కు, నెల వ‌య‌స్సు ఉన్న దాని పిల్ల‌ల‌కు నిప్పు పెట్టిన ఇద్ద‌రు మ‌హిళలు..

September 8, 2021 1:40 PM

కొంద‌రు మ‌నుషుల్లో రోజు రోజుకీ క్రూర‌త్వం పెరిగిపోతుంద‌ని చెప్పేందుకు ఈ సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌. కేర‌ళ‌లో అత్యంత అమానుష‌మైన‌, దారుణ‌మైన సంఘట‌న చోటు చేసుకుంది. మూగ‌జీవాల ప‌ట్ల ఇద్ద‌రు మ‌హిళ‌లు రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించారు. ఓ త‌ల్లి కుక్క‌తోపాటు నెల రోజుల వ‌య‌స్సు ఉన్న దాని పిల్ల‌ల‌కు ఇద్ద‌రు మ‌హిళ‌లు నిప్పు పెట్టారు. ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

దారుణం.. త‌ల్లి కుక్క‌కు, నెల వ‌య‌స్సు ఉన్న దాని పిల్ల‌ల‌కు నిప్పు పెట్టిన ఇద్ద‌రు మ‌హిళలు..

కేర‌ళ‌లోని ఎర్నాకులం జిల్లా అలంగ‌ద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న మంజ‌లి అనే చిన్న గ్రామంలో నివాసం ఉంటున్న మేరీ, ల‌క్ష్మీ అనే ఇద్ద‌రు మ‌హిళ‌లు ఓ త‌ల్లి కుక్క‌తోపాటు నెల రోజు వ‌య‌స్సు ఉన్న దాని 7 పిల్ల‌ల‌కు నిప్పు పెట్టారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

https://youtu.be/n-t-Q25E7V8

అయితే రెండు కుక్క పిల్ల‌లు తీవ్ర‌గాయాల‌తో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాయి. త‌ల్లి కుక్క‌, ఇంకో 5 పిల్ల‌లు బ‌తికాయి. అవి అక్క‌డి నుంచి పారిపోగా ఓ మ‌హిళ వాటిని గ‌మ‌నించి జంతు సంర‌క్ష‌ణ సిబ్బందికి స‌మాచారం అంద‌జేసింది. దీంతో వారు ఆ కుక్క‌ల‌ను చేర దీశారు. వాటికి చికిత్స అందిస్తున్నారు.

కాగా ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కుక్క‌ల ప‌ట్ల ఈ విధంగా అత్యంత అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now